
నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా.. విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై లుక్కేద్దాం.
మాతృదేవోభవ(1993)- యూట్యూబ్
అమ్మ ప్రేమను చక్కగా చూపిన సినిమాల్లో మాతృదేవోభవ ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. 1993లో వచ్చిన ఈ మూవీలో నాజర్, మాధవి ప్రధాన పాత్రల్లో కె. అజయ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టకుండా ఎవరూ బయటకు రాలేదు. అంతలా ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరైంది. భర్తను కోల్పోయి, క్యాన్సర్ బారిన పడిన మహిళ తన పిల్లల భవిష్యత్తు కోసం పడిన ఆరాటమే ఈ సినిమా కథ.
అమ్మ రాజీనామా (1991) - యూట్యూబ్
దాసరి నారాయణరావు తెరకెక్కించిన 'అమ్మ రాజీనామా' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తల్లిగా శారద నటనను చూసిన ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. ఈ సినిమాను దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించారు. కుటుంబం కోసం తల్లి చేసే త్యాగాన్ని చూపే ఈ చిత్రానికి ప్రత్యేకస్థానం ఉంది. 2001లో ఈ సినిమా కన్నడలో 'అమ్మ' పేరుతో పునర్నిర్మించారు. ఇందులో లక్ష్మి ప్రధాన పాత్ర పోషించింది.
ఒకే ఒక జీవితం(2022)- సోనీలివ్
శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.
'బిచ్చగాడు'(2016)- సన్ నెక్స్ట్
తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)- ఆహా, అమెజాన్
2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
నిజం(2003 )- జీ5
కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది.
వీటితో పాటు
అమ్మ చెప్పింది (2006)- నెట్‌ఫ్లిక్స్
2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
ప్రభాస్ 'ఛత్రపతి'(2005)- జియోహాట్‌స్టార్, అమెజాన్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)- సన్ నెక్స్ట్
2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
సింహరాశి- యూట్యూబ్
2001లో విడుదలైన 'సింహరాశి' అమ్మ ప్రేమకోసం తపించే కుమారుడి పాత్రలో రాజశేఖర్ నటించారు. ఆయన కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం మొదట బాలకృష్ణను సంప్రదించారు. కానీ ఆయన దానిని తిరస్కరించడంతో రాజశేఖర్‌తో దర్శకులు వి. సముద్ర తెరకెక్కించారు. ఆర్‌బి చౌదరి నిర్మించారు. ఇది తమిళ చిత్రం మాయికి రీమేక్ అని తెలిసిందే.
అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్, చిరుత, అమ్మ రాజీనామా, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి.