matrudevobava
-
'మాతృదేవోభవ'తో కన్నీళ్లు పెట్టించిన మాధవి ఏం చేస్తుందో తెలుసా..?
‘మాతృదేవోభవ’ 1993లో వచ్చిన మేటి చిత్రాల్లో బ్లాక్‌బస్టర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ మాధవి నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఆ పాత్రకు ఆమె కనెక్ట్ అయ్యారు. ఆమె భర్తగా నాజర్ చాలా కీలకమైన భూమిక పోషించారు. అయితే నేడు ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని సినిమాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నటి మాధవి ప్రస్తుతం ఎలా ఉందొ చూడండి అంటూ కొన్ని ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.80,90లో తన అందం, అభిమనయంతో ఆకట్టుకున్న నటి మాధవి చాలా ఏళ్ల క్రితమే వెండతెరకు దూరమయ్యారు. అందంలో జయసుధ, జయప్రద వంటి హీరోయిన్స్‌కి పోటినిచ్చిన ఆమె ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫొటోలు చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. తన తెనె కళ్లతో మాయ చేసిన ఆమె ఇంతలా మారిపోయారేంటంటూ సర్ప్రైజ్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మెప్పించిన మాధవి దాదాపు 300 సినిమాల వరకు చేశారు. చిరంజీవి ‘ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైది వంటి సినిమాల్లో ఆమె చిరంజీవికి జోడికట్టారు.చెప్పాలంటే అప్పట్లో చిరు-మాధవి పెయిర్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. ఇక మాధవి గ్లామర్, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యం తన కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అందులో లేడి ఫ్యాన్స్ కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. ఇక ఆమె కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ‘మాతృదేవోభవ’. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్ ఇప్పటికి ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది.ముఖ్యం ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అలా నటిగా కెరీర్ పీక్‌లో ఉండగానే మాధవి సడెన్‌గా వెండితెరకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన బిజినెస్ మెన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిలైపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలు ఎదగడంతో భర్తకు సాయంగా బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటున్న మాధవి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లెటెస్ట్ ఫొటోలు చూసి నెట్టింట వైరల్‌గా మారాయి.'మాతృదేవోభవ'ను వదులుకున్న జీవితమాతృదేవోభవ సినిమాలో నటించాలని మొదట సీనియర్ నటి జీవితా రాజశేఖర్‌కు చిత్రయూనిట్ సంప్రదించింది. అయితే, ఆమెకు అప్పటికే పెళ్లి కావడంతో గృహిణిగా ఉండాలని నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆమె సున్నితంగా కాదని చెప్పారు. దీంతో ఆ పాత్ర మాధవి చేసింది. తర్వాత సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆమె బాధపడలేదు. భర్త, పిల్లలే తన ప్రపంచం అంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 1990లో 'మగాడు'లో ఆమె చివరిసారిగా నటించారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత ఇటీవల ‘లాల్ సలాం’లో కనిపించారు. -
'అమ్మ' ప్రేమను ప్రతిబింబించే ఈ సినిమాలను చూశారా..?
నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా.. విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై లుక్కేద్దాం.మాతృదేవోభవ(1993)- యూట్యూబ్అమ్మ ప్రేమను చక్కగా చూపిన సినిమాల్లో మాతృదేవోభవ ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. 1993లో వచ్చిన ఈ మూవీలో నాజర్, మాధవి ప్రధాన పాత్రల్లో కె. అజయ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టకుండా ఎవరూ బయటకు రాలేదు. అంతలా ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరైంది. భర్తను కోల్పోయి, క్యాన్సర్ బారిన పడిన మహిళ తన పిల్లల భవిష్యత్తు కోసం పడిన ఆరాటమే ఈ సినిమా కథ.అమ్మ రాజీనామా (1991) - యూట్యూబ్దాసరి నారాయణరావు తెరకెక్కించిన 'అమ్మ రాజీనామా' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తల్లిగా శారద నటనను చూసిన ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. ఈ సినిమాను దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించారు. కుటుంబం కోసం తల్లి చేసే త్యాగాన్ని చూపే ఈ చిత్రానికి ప్రత్యేకస్థానం ఉంది. 2001లో ఈ సినిమా కన్నడలో 'అమ్మ' పేరుతో పునర్నిర్మించారు. ఇందులో లక్ష్మి ప్రధాన పాత్ర పోషించింది.ఒకే ఒక జీవితం(2022)- సోనీలివ్శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.'బిచ్చగాడు'(2016)- సన్ నెక్స్ట్తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)- ఆహా, అమెజాన్2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.నిజం(2003 )- జీ5కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటుఅమ్మ చెప్పింది (2006)- నెట్‌ఫ్లిక్స్2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.ప్రభాస్ 'ఛత్రపతి'(2005)- జియోహాట్‌స్టార్, అమెజాన్రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)- సన్ నెక్స్ట్2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.సింహరాశి- యూట్యూబ్2001లో విడుదలైన 'సింహరాశి' అమ్మ ప్రేమకోసం తపించే కుమారుడి పాత్రలో రాజశేఖర్ నటించారు. ఆయన కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం మొదట బాలకృష్ణను సంప్రదించారు. కానీ ఆయన దానిని తిరస్కరించడంతో రాజశేఖర్‌తో దర్శకులు వి. సముద్ర తెరకెక్కించారు. ఆర్బి చౌదరి నిర్మించారు. ఇది తమిళ చిత్రం మాయికి రీమేక్ అని తెలిసిందే.అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్, చిరుత, అమ్మ రాజీనామా, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. -
అభాగ్యులకు అమ్మలా..
మతిస్థిమితం కోల్పోయిన మానసిక వికలాంగులకు, అనాథలకు అండగా నిలుస్తోంది.. ఏ చిరునామా లేని అభ్యాగులకు ఓ కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. రుచికరమైన భోజనం వడ్డించడంతో పాటు దుస్తులు, పడుకునేందుకు మంచం, దుప్పటి వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.. తమకు ఎవరూ లేరనే బాధ నుంచి అక్కడ ఉన్నవారంతా తమవారే అన్న భరోసా ఇస్తోంది.. కుల మత, భాషా బేధాలతో సంబంధం లేకుండా అభాగ్యులందరినీ చేరదీస్తోంది. అంతేకాదు అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథ మానసిక దివ్యాంగుల ఆశ్రమం. – బడంగ్పేట్ఒక్కరితో 2018లో ప్రారంభమైన ఈ ఆశ్రమ సేవలు ప్రస్తుతం 150 మందికి చేరుకున్నాయి. మధ్య వయసులో మతి స్థిమితం కోల్పోయి.. జుట్టు, గడ్డాలు, మీసాలు పెరిగి గుర్తుపట్టలేని స్థితిలో అర్ధనగ్నంగా వీధుల్లో సంచరిస్తున్న వారితో పాటు నగరంలోని ప్రధాన రోడ్ల వెంట, డ్రైనేజీలు, చెత్త డబ్బాల పక్కన దీనంగా పడి ఉన్న అనాథలను ఆశ్రమానికి తరలిస్తున్నారు మాతృదేవోభవ సంస్థ నిర్వాహకులు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కోలుకున్న వారిని తిరిగి ఇళ్లకు పంపుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 280 మందికి పునర్జన్మను ప్రసాదించారు. ఆశ్రమ సేవలు గుర్తించిన సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి వారు కూడా అభాగ్యులకు సేవలు అందిస్తుండటం విశేషం. పండగలు, పర్వదినాలు, పుట్టిన రోజులు ఇలా అన్ని సందర్భాల్లోనూ వారు భాగస్వాములు అవుతున్నారు.‘ఈయన పేరు డి.శివుడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. ఆరేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి.. ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఊరే కాదు చివరకు జిల్లా సరిహద్దులు దాటుకుని చివరకు ఉప్పల్ చేరుకున్నాడు. రోడ్డు వెంట అనాథగా తిరుగుతున్న ఆయనను మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించి వైద్యం అందించారు. కోలుకున్న తర్వాత బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ వృద్ధాప్యంతో మంచం పట్టిన తల్లికి సపర్యలు చేస్తున్నాడు’ అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు ఏదైనా ప్రమాదాల్లో చనిపోయిన అనాథ శవాలనే కాకుండా ఆశ్రమంలో ఉంటూ వృద్ధాప్యం, ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారికి ఆయా మతాల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతిమ యాత్రలో మాతృదేవోభవ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకుడు గిరితో పాటు అతడి భార్య ఇందిర, అమ్మ ముత్తమ్మ, కొడుకు అభిరాం, కూతురు లోహిత ఆ నలుగురిలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 60 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. సేవలను గుర్తించిన పలు సంస్థలు గిరిని గౌరవ డాక్టరేట్‌తో పాటు 300 అవార్డులతో సత్కరించాయి. నాడు‘చిత్రంలోని ఈయన పేరు కావూరి నాగభూషణం. పశి్చమగోదావరి జిల్లా పొలమూరు మండలం నాగిళ్లదిబ్బ గ్రామం. ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి బంజారాహిల్స్ చేరుకున్నాడు. చినిగిన దుస్తులు, మాసిన గడ్డం, పెరిగిన జుట్టుతో తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ.. తిరుగుతూ కని్పంచాడు. మాతృదేవోభవ ఆశ్రమం నిర్వాహకులు ఆయనను చేరదీసి, ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు తెలుపగా.. ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆయన్ను బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం సొంత ఊరిలో రెండు ఆవులను చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాడు’ నేడు నాడు‘చిత్రంలో కనిపిస్తున్న ఇతడి పేరు వట్టేం రమేష్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం, శివపురం గ్రామం. నాలుగేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ చివరకు నగరానికి చేరుకున్నాడు. మాతృదేవోభవ అనాథ ఆశ్రమ నిర్వాహకులు చేరదీసి ఆశ్రమం కల్పించారు. అతడికి మెరుగైన చికిత్సతో పాటు ప్రశాంత వాతావరణం కల్పించడంతో నాలుగేళ్లకు ఆరోగ్యం కుదుటపడింది. కుటుంబ వివరాలు తెలుసుకుని, చివరకు వారికి అప్పగించారు. ప్రస్తుతం సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు’నేడు కొంత స్థలం కేటాయించాలి శాశ్వత భవనం లేకపోవడంతో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలిక షెడ్లు వేసి, వాటిలో వసతి కలి్పస్తున్నాం. స్థలం కేటాయిస్తే మరింత మందికి సేవలు అందిస్తాం. ఆశ్రమంలో ఉన్న వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ సహా ఆరోగ్యశ్రీకార్డు, రేషన్ బియ్యం ఉచితంగా అందజేయాలి. – గట్టు గిరి, ‘మాతృదేవోభవ’ఆశ్రమ వ్యవస్థాపకుడు -
మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే
'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు' అన్న డైలాగ్ కేజీఎఫ్ సినిమాలో చెప్పిందే కావొచ్చు. కానీ ఒక తల్లి ప్రేమ అంతకు మించి ఉంటుందని మాత్రమే చెప్పగలను. తొమ్మిది నెలలు తాను ఎన్నో బాధలను దిగమింగి బిడ్డకు జన్మినిస్తుంది. అంతే కాకుండా తన పిల్లల కలలను నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడుతుంది. కానీ ఎప్పుడే గానీ తన బాధను బయటికి చెప్పలేని పిచ్చి ప్రేమ అమ్మది. అలాంటి అమ్మకు మన జీవితంలో ఏం చేసినా తక్కువే అవుతుంది. తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకు ప్రపంచంలో ఏదీ సాటిరాదు. అలాంటి అమ్మ ప్రేమను మనకు తెలియజేస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. మదర్స్ డే సందర్భంగా ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 'మాతృ దేవో భవ' మాధవి, నాసర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాతృ దేవో భవ'. ఈ చిత్రాన్ని కెఎస్ రామారావు నిర్మించగా.. కె అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1993లో విడుదలైన ఈ చిత్రం క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళంలో సిబి మలైల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశదూతు’కి రీమేక్. ఈ చిత్రం తరువాత హిందీలో 'తులసి'గా రీమేక్ చేశారు. అదే నిర్మాత-దర్శకులు నిర్మించగా మనీషా కొయిరాలా, ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రం వూట్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. 'బిచ్చగాడు' తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది. ప్రభాస్ 'ఛత్రపతి' 2005లో విడుదలైన ‘ఛత్రపతి’ అప్పట్లో ప్రభాస్‌కి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రెండు పొరలు ఉన్నాయి, అందమైన తల్లీ కొడుకుల అనుబంధం మరియు మంచి ప్రతీకార కథ. ఈ సినిమాలో భానుప్రియ, శ్రియ శరణ్ కూడా నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి. అమ్మ చెప్పింది 2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అమ్మా రాజీనామా 1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం అమ్మ రాజీనామా. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తను బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో శారద ప్రధాన పాత్రలో నటించారు. 2001లో ఈ సినిమాను కన్నడలోనూ అమ్మ పేరుతో రీమేక్ చేశారు. ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్, యూ ట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది. యమ లీల 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం యమలీల. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గాను సుచిత్రకు ఉత్తమ నృత్య దర్శకురాలిగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం హిందీలో ‘తక్దీర్వాలా’గా, తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 'నిజం' కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి: 2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. -
Nayanthara: 'మాతృదేవోభవ' రీమేక్‌లో నయనతార
అమ్మప్రేమలోని గొప్పతనాన్ని అడుగడుగునా చాటిచెప్పిన చిత్రం మాతృదేవోభవ. 1993లో విడుదలైన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని ప్రేక్షకులు లేరు. అమ్మప్రేమలోని మాధుర్యాన్ని అంతలా కనెక్ట్ చేసిన చిత్రమిది. కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో నాజర్, మాధవి నటించిన ఈ చిత్రాన్ని కె.ఎస్. రామారావు నిర్మించారు. తాజాగా చిత్ర నిర్మాత రామారావు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తనకు మాతృదేవోభవ రీమేక్ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టేశారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అజయ్ కుమారే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాలని పేర్కొన్నారు. అయితే హీరోయిన్ పాత్రలో ఎవరు నటించాలనే ప్రశ్నకు బదులుగా..నయనతార, కీర్తి సురేష్ ఇద్దరూ ఈ పాత్రకు సరిపోతారని, నయనతార నటన ఇంకాస్త మెచ్యూర్డ్ కూడా ఉంటుందని, ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడున్న నటీనటులు కథ కంటే రెమ్యూనరేషన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని, వాళ్లు అడిగే రెమ్యూనరేషన్ వింటేనే కంగారు ఉందని చెప్పుకొచ్చారు. మరి చిన్న పాత్రకు సైతం భారీ పారితోషికం అందుకునే నయనతార ఈ సినిమాను చేస్తోందా? లేక కథకు ప్రాధాన్యమిచ్చి రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనక్కు తగ్గుతుందా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది చదవండి : పుష్ప: ఆ రోల్ చేయడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందా? సామాన్యుల కోసం నడుం బిగించిన నటుడు -
మనసా స్మరామి : రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...
మా ఊరు గుంటూరు జిల్లా, వెనిగండ్ల. పుట్టింది ఒకచోట, పెరిగింది ఒకచోట, చదువుకున్నది మరోచోట. చిన్నప్పుడు చదువుకోనని తెగ మారాం చేస్తుంటే మా మామయ్య నన్ను బాపట్లలోని వాళ్ళింటికి తీసుకెళ్ళి చదువుతో పాటు, శ్రద్ధబుద్ధులు నేర్పించారు. అప్పుడు నా వయసు ఆరు సంవత్సరాలు. అక్కడే నాకు సాహిత్య సాన్నిహిత్యంతో పాటు సినీగేయ సాహిత్యంపై అవగాహన ఏర్పడింది. మా మామయ్య సూర్యోదయానికి ముందే నన్ను నిద్ర లేపి మంత్రాలు, వాటి అర్థాలు చెబుతుండేవారు. నాకు బోర్ కొడుతుందన్నప్పుడు సినిమా పాటలు, ఆ సినీగేయకవి గురించి ఎక్కువగా చెప్పేవారు. అలా మా మామయ్య మాటల ద్వారా పరిచయమైన కవి వేటూరిగారు. వారి పాటలు రోజుకి ఒకటి చొప్పున అర్థాలు తెలుసుకుంటూ ఉండేవాడిని. అలా వారి కవనాల్లో నా మనసుని బాగా కదిలించిన పాట ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...’’. అప్పటి వరకు తత్త్వాన్ని, తర్కాన్ని సంస్కృతంలో తెలుసుకుంటున్న నాకు, అలతి పదాలతో తెలుగులో కూడా తత్త్వాన్ని చెప్పొచ్చని అర్థమయ్యింది. వేటూరి గారి సాహిత్యానికి కీరవాణి స్వరం, స్వరకల్పన తోడైన ఈ పాట నా మనసుపొరల్లో చెరగని మధురామృతాన్ని నింపింది. తర్వాత నాలో గీత రచయిత కావాలనే కోరికను రగిలించింది. జాతీయ పురస్కారం అందుకున్న ‘అద్వైతం’ లఘుచిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన నా సాహిత్యానికి, ఈ పాటే మార్గదర్శకమైంది. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... తోటవూలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే నీకిది తెలవారని రేయువ్మూ... కలికీ వూ చిలక..! పాడకు నిన్నటి నీ రాగం...’ ఈ పల్లవిలో కవి కనిపిస్తాడు. కవి పువ్వుని, సాయంత్రాన్ని ప్రశ్నిస్తున్నాడు. రాలే పువ్వు, వాలే పొద్దు ఈ రెండూ ఎక్కువ రంగులని ఈనుతుంటాయి. ఐనా గతించే నీకు ఇన్ని రంగులు, హంగులు ఎందుకు..? అనే తత్త్వం పాట ఆద్యంతం మనకి కనిపిస్తుంది. ‘చెదిరింది నీ గూడు గాలిగా చిలకగోరింకవ్ము గాథగా... చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా.... తన వాడు తారల్లో చేరగా వునసు వూంగల్యాలు జారగ... సిందూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా తిరిగే భూవూత వు నీవై వేకువలో వెన్నెలవై... కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై’ చిలకగోరింకల్లా కలకాలం చల్లగా ఉండండి అని మనం నవ దంపతులను దీవిస్తుంటాం. నిజానికి చిలక, గోరింక రెండూ కలిసి ఉండవు. కాపురం చేయవు. చిత్రంలో సత్యం (నాజర్), శారద (మాధవి) ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ చిర్రుబుర్రులాడుతుంటారు. చివరికి రూపం లేకుండా పోయి శూన్యంలో కలిసింది. శారద భర్త చనిపోవడంతో సుఖాలు, కోరికలు అన్నీ తన ‘సిందూరం’ తో తెల్లారి చల్లారిపోయాయి. కేవలం తన బిడ్డల కోసం ఓర్పుతో భూమాతలా తిరుగుతూ కష్టపడుతుంది. ‘అనుబంధవుంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ వుబ్బులే హేవుంతరాగాల చేవుంతులే వాడిపోయే... తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పోయే...’ ‘ఋణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయం’ అంటారు. ఈ భవబంధాలన్నీ పూర్వజన్మలో తీరని ఋణం వలన ఏర్పడతాయి. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగి తలకు మించిన భారం అవుతుంది. అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మోక్షం రాదు. తన తరువాత తన పిల్లలు ఏమైపోతారో అని పరితపిస్తున్న శారదకి కవి గొంతు ఇలా తత్త్వాన్ని చెప్పింది. వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం ఆశల హారతి, జారిపడే జాబిలి, కరిగే మబ్బు... వీటిన్నింటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది, చివరికి తీగ తెగిన వీణలా బంధాలనన్నింటినీ తెంచుకుని శరీరం మూగబోతుంది... అని తత్త్వాన్ని వర్ణించడం వేటూరిగారి కలానికే చెల్లింది. భూమి మీద మనుషులు, బంధాలు-అనుబంధాలు ఉన్నంత కాలం ఈ పాటలోని ప్రతి అక్షరం అజరామరం. - సంభాషణ: నాగేశ్