ఐసీయూలో సినీ రచయిత, కేటీఆర్‌​ సాయం!

Minister KTR Help To Tollywood Lyricist Kandikonda Giri For Treatment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ గేయ రయిత కందికొండ గిరి ఇటీవలే అనారోగ్యానికి గురయ్యాడు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయన ఒక్కరోజు వైద్యానికే రూ.70 వేలకు పైగా ఖర్చవుతోందట. అతడి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో కుటుంబ సభ్యులు సాయం కోసం చూస్తున్నారట. ఈ విషయం తెలిసిన కేటీఆర్‌ ఆయనకు సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

కాగా కందికొండ గిరి బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క పండగల మీద ఎన్నో జానపద పాటలు రాశాడు. దేశముదురు, పోకిరి, ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి లాంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో వెయ్యికి పైచిలుకు పాటలు రచించాడు.

చదవండి: అదంతా మనం చూసే సంస్కారంలో ఉంది: సిరివెన్నెల

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top