పితృస్వామ్యాన్ని నాశనం చేద్దాం! | Message On Rhea Chakraborty Tee Goes Viral | Sakshi
Sakshi News home page

పితృస్వామ్యాన్ని నాశనం చేద్దాం!

Sep 8 2020 6:03 PM | Updated on Sep 8 2020 6:10 PM

Message On Rhea Chakraborty Tee Goes Viral - Sakshi

ముంబై : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో నటి రియా చక్రవర్తి అరెస్టు అయిన విషయం తెలిసిందే. సుశాంత్‌ కేసు విచారణలో ఆరోపణలు ఎదర్కొంటున్న ప్రధాన నిందితురాలు రియాను నార్కోటిక్స్‌ కంటట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరు పరచనున్నారు. అయితే డ్రగ్‌ కేసులో రియా 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వెల్లడించింది.  (డ్రగ్స్‌ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్‌)

ఇదిలా ఉండగా నటి రియాను ఎన్‌సీబీ అధికారులు నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో మూడో రోజు ఎన్సీబీ కార్యాలయానికి చేరుకునే ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ ఫోటోలు అంతలా వైరల్‌ అవ్వడానికి కారణం ఆమె ధరించిన టీషర్టుపై ఉన్న ప్రింట్‌యే. ఆ రోజు రియా నలుపు రంగు టీ షర్టు ధరించగా దానిపై.. ‘గులాబీలు ఎరుపు.. వైలెట్లు నీలం.. పితృస్వామ్యాన్ని అందరం నాశనం చేద్ధాం’ అంటూ రాసి ఉంది. దీనిని చాలా మంది నెటిజన్లు గుర్తించడంతో ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. (బాలీవుడ్ ప్రముఖు‌లు కూడా ఉన్నారు: రియా)

Advertisement
 
Advertisement
Advertisement