యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న సిద్ శ్రీరామ్ పాట | Mechanic Movie: Nachesave Pilla Nachesave Song Got 70 Lakh Views In Youtube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న సిద్ శ్రీరామ్ పాట

Oct 7 2023 9:23 PM | Updated on Oct 7 2023 9:23 PM

Mechanic Movie: Nachesave Pilla Nachesave Song Got 70 Lakh Views In Youtube - Sakshi

సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ గొంతుకు టాలీవుడ్‌లో చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయన నుంచి ఒక పాట వస్తే చాలు.. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస​్‌ వచ్చేస్తాయి. తాజాగా ‘మెకానిక్’ సినిమాలో ఆయన ఆలపించిన ‘నచ్చేసావే పిల్లా’ కూడా మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.  మణి సాయి తేజ, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’.ట్రబుల్ షూటర్ ట్యాగ్ లైన్.  నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి ఇటీవల సిద్ శ్రీరామ్ పాడిన పాట "నచ్చేసావే పిల్లా నచ్చేసావే" పాటను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా వ్యూస్‌ రావడం పట్ల చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది. 

ఈ సందర్భంగా నిర్మాత నాగ  మునెయ్య(మున్నా) మాట్లాడుతూ "వినోద్ యాజమాన్య అందించిన సంగీతం మా చిత్రానికి హైలైట్. ఇటీవలే  సిద్ శ్రీరామ్ పాడిన పాట "నచ్చేసావే పిల్లా నచ్చేసావే" ఇంటర్నెట్ లో ట్రేండింగ్ అయింది. యూట్యూబ్ లో 70 లక్షల వ్యూస్ మరియు ఇంస్టాగ్రామ్ లో 10 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఇంతకు ముందు విడుదల అయిన 'టూలేట్ బోర్డు ఉంది నీ ఇంటికి' అనే పాటని 16 లక్షల మంది యూట్యూబ్ లో వీక్షించారు. మా "మెకానిక్" చిత్రం విడుదల కాకముందే మంచి మ్యూజికల్ హిట్ అయినందుకు సంతోషంగా ఉంది. మా చిత్రం తెలుగుతో పాటు తమిళం,  కన్నడ, హిందీ  భాషల్లో  విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.  త్వరలో సెన్సార్ సెన్సార్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటిస్తాం" అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement