డోస్‌ రెండింతలు

Manchu Vishnu Announces Dhee Sequel With Sreenu Vaitla - Sakshi

మంచు విష్ణు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఢీ’. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. సోమవారం విష్ణు పుట్టినరోజు సందర్భంగా ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘డి–డి’ని ప్రకటించారు చిత్రనిర్మాత, హీరో మంచు విష్ణు, దర్శకుడు శ్రీను వైట్ల. 24 ఫ్యాక్టరీ ఫిలింస్‌ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

సంకెళ్ల మధ్య రెండు ‘డి’ అక్షరాలను డిజైన్‌ చేశారు. ‘ఢీ’లో ఉన్న కామెడీ, యాక్షన్‌ ఈ సీక్వెల్లో రెట్టింపు ఉంటాయనే ఉద్దేశంతో ‘డబుల్‌ డోస్‌’ అని ట్యాగ్‌లైన్‌ పెట్టారు. గోపీమోహన్, కిషోర్‌ గోపులు రచయితలుగా చేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అవ్రామ్‌ భక్త మంచు, సంగీతం: మహతి స్వరసాగర్, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top