హీరోయిన్‌ రీమాసేన్‌ ఫ్యామిలీని చూశారా?

Manasantha Nuvve Heroine Reema Sen With Family - Sakshi

రీమాసేన్‌..  ఈమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పాలి. పదిహేనేళ్ల వయసులోనే నటిగా వెండితెరపై ప్రయాణం ఆరంభించిందీ రీమా. 'చిత్రం'తో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన ఆమె మొదటి సినిమాతోనే స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. అలా.. తొలి సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న టాలీవుడ్‌ హీరోయిన్ల లిస్టులో రీమా కూడా చేరిపోయింది.

ఆమె నటించిన మనసంతా నువ్వే, వల్లభ సహా పలు చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.. సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె తన అందచందాలతో కుర్రకారుల మతులు పోగొట్టింది. ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన ఆమె మూడు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను అందుకుంది.

తనకు వచ్చిన క్రేజ్‌ చూసి రీమాకు తిరుగు లేదనుకున్నారంతా! కానీ తెలుగు, తమిళం, హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో రీమాసేన్‌ పెళ్లి పీటలెక్కింది. 2012లో వ్యాపారవేత్త శివకరణ్‌తో ఏడడుగులు నడిచింది. వీరి దాంపత్యానికి గుర్తుగా మరుసటి ఏడాదే రుద్రవీర్‌ అనే కొడుకు జన్మించాడు. రీమాసేన్‌ అప్పటి నుంచి ఏ సినిమా అంగీకరించలేదు. దీంతో ఆమె వెండితెరకు పూర్తిగా దూరమైంది.

ఇక నటనకు గుడ్‌బై చెప్పేసిన రీమాసేన్‌ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది. అయితే సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే అందాన్ని మెయింటెన్‌ చేస్తోందీ హీరోయిన్‌. భర్త, కొడుకే ప్రాణంగా బతుకుతున్న రీమా తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది.  ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకున్న ఫొటోలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. మరి రీమాసేన్‌ భర్త, కొడుకు ఎలా ఉన్నారో మీరూ చూసేయండి..

చదవండి: PSPK28:పవన్‌ కల్యాణ్‌ చిత్రంలో నటించడం లేదు: హీరోయిన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top