Mallika Sherawat: బాలీవుడ్‌ నెపోటిజంపై బోల్డ్‌ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Mallika Sherawat Open Up On Bollywood Nepotism Said She Lost Many Movie Offers - Sakshi

Mallika Sherawat On Bollywood Nepotism: దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి అనంతరం బాలీవుడ్‌ నెపోటిజంపై జరిగిన రచ్చ అంతఇంత కాదు. దీనిపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ పెద్దలపై, నటీనటులపై విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో దర్శకడు మహేశ్‌ భట్‌ కూతురు పూజా భట్‌, కంగనాకు మధ్య మాటల యుద్ధమే జరిగింది. అనంతరం క్రమంగా ఈ వివాదం కాస్తా సద్దుమనుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా బోల్డ్‌ బ్యూటీ, నటి మల్లిక షెరావత్‌ వ్యాఖ్యలతో నెపోటిజం(బంధుప్రీతి) మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల బాలీవుడ్‌ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై మల్లిక ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేసింది.  

చదవండి: చివరి రోజుల్లో సిద్ధార్థ్‌తో లేనందుకు బాధగా ఉంది: నటి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోల గర్ల్‌ఫ్రెండ్స్‌, చెల్లెల్లు, బంధువుల కారణంగా చివరి క్షణాల్లో నన్ను సినిమాల నుంచి తప్పించారని వాపోయింది. ‘నెపోటిజం కారణంగా నాకు వచ్చిన ఎన్నో సినిమా అవకాశాలు చేజారిపోయాయి. కొన్నిసార్లు నా స్థానంలో హీరోల గర్ల్‌ఫ్రెండ్‌, మరికొందరి ప్రియురాళ్లు, నటుల చెల్లెల్లు, బంధువులను తీసుకున్నారు. ఇది పరిశ్రమలో సాం‍ప్రదాయంగా కొనసాగుతుంది. పరిశ్రమలో ఎన్నటికీ ఇది మారదు. అందుకే ఇవేవి నన్ను బాధించలేదు. అసలు వీటిని నేను అంతగా పట్టించుకొనేదాన్ని కూడా కాదు. నా స్వయం శక్తిని నమ్ముకున్నాను. నా పని ఏంటి, ఆ రోజు నా షూటింగ్‌ ఏంటీ దానిపైనే శ్రద్ధ పెట్టాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 

చదవండి: షెర్లిన్‌ వల్లే రాజ్‌కుంద్రాకు ఈ గతి పట్టింది: నటి సంచలన వ్యాఖ్యలు

అలాగే బోల్డ్‌ సీన్స్‌లో నటించడం వల్ల తను ఎదుర్కొన్న ట్రోల్స్‌పై స్పందించింది. ‘ప్రారంభంలో ట్రోలర్స్‌ నన్ను టార్గెట్‌ చేసేవారు. కానీ అదే బోల్డ్‌ సన్నివేశాల్లో నటించిన పరుషులు మాత్రం బాగానే ఉండేవారు. వారికి అందరిలాగే సమాజంలో గౌరవం ఉండేది. వారి మీద ఎలాంటి కామెంట్స్‌ చేసేవారు కాదు. కానీ మహిళలను మాత్రం విపరీతంగా ట్రోల్‌ చేసేవారు. అదే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. సమాజం ఎందుకు ఇలా ఆలోచిస్తుంది. ఈ సమస్య కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచ దేశాలలోనూ ఉంది. ఎక్కడ చూసిన మహిళలనే టార్గెట్‌ చేస్తారు. కానీ ఇది ఇండియాలో కాస్తా ఎక్కువగా ఉంది. కొన్ని మీడియా చానల్స్‌ అయితే నటీమణులు బోల్డ్‌ సీన్స్‌ చేస్తే అది పెద్ద నేరంగా చూసేవి. అసలు సపోర్ట్‌ ఇచ్చేవి కాదు. కానీ ఇప్పుడు కాస్తా మారియి. ఇలాంటి విషయాల్లో మహిళలకే మద్దుతుగా నిలుస్తున్నాయి. బోల్డ్‌ సీన్స్‌ను అంగీకరిస్తున్నారు. ఎలాంటి అశ్లీల పాత్రలు చేసిన దానిని నటనగానే చూస్తున్నాయి’ అని ఆమె పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top