'అమీర్‌పేట్‌లో అలాంటి కోచింగ్‌ కూడా ఉంటే బాగుండు'..! | Sakshi
Sakshi News home page

Premalu Telugu Trailer: 'అమీర్‌పేట్‌లో ఆ కోచింగ్‌ కూడా ఇస్తే బాగుండు'..!

Published Sun, Mar 3 2024 8:16 PM

Malayalam Super Hit Movie Telugu Trailer Released  - Sakshi

మలయాళంలో హిట్‌గా సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ 'ప్రేమలు'. కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. దీంతో డబ్బింగ్ చేసి టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఇక్కడ కూడా  రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 

కాగా.. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. ట్రైలర్‌ చూస్తే తెలుగు ప్రేక్షకులకు సైతం కనెక్ట్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఇలాంటి రొమాంటిక్ ప్రేమకథ యూత్‌ను అలరించండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే అదే రోజున గోపీచంద్ 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌ చేసే సినిమాలు రానున్నాయి. 

ప్రేమలు సినిమా కథ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చేసిన సచిన్‌కి(నస్లేన్) యూకే వెళ్లాలనేది ప్లాన్. కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంతూరిలో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్‌తో కలిసి హైదరాబాద్‌కి వస్తాడు. ఇక్కడ ఓ పెళ్లిలో రీనూ(మమిత బైజు)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాజ్ చేస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ చివరకు ఒక్కటయ్యారా? ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది స్టోరీ.

Advertisement
 
Advertisement