Actress Malavika Mohanan Spotted The Tiger During A Safari At Ranthambore National Park - Sakshi
Sakshi News home page

పులితో ఫొటో: కళ్లల్లో కాస్తైనా భయం లేదే!

Mar 7 2021 11:54 AM | Updated on Mar 7 2021 2:01 PM

Malavika Mohanan Goes On A Safari At Ranthambore National Park - Sakshi

అక్కడ ఎన్నో జంతువులను దగ్గరగా చూస్తూ, వాటితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలో పులితో దిగిన ఫొటోలను..

మాస్టర్‌ సినిమాతో సూపర్‌ సక్సెస్‌ అందుకుంది హీరోయిన్‌ మాళవిక మోహనన్‌. ఇదే జోష్‌లో మరిన్ని సినిమాలకు కూడా సంతకం చేసిందీ భామ. తాజాగా తన బిజీ షెడ్యూల్‌కు విరామం పలుకుతూ విహారయాత్రకు వెళ్లింది. రాజస్తాన్‌లోని రణ్‌తంబోర్‌ నేషనల్‌ పార్కును చుట్టేస్తోంది. అక్కడ ఎన్నో జంతువులను దగ్గరగా చూస్తూ, వాటితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలో పులితో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇది చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. పైగా ఆమె కళ్లలో కాస్తైనా భయం కనిపించట్లేదని కామెంట్లు చేస్తున్నారు. ఫ్రెండ్‌తో ఫొటో దిగినంత ఈజీగా పులితో దిగింది అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటో ప్రస్తుతం బాగానే ట్రెండ్‌ అవుతోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పులిని మరింత దగ్గర నుంచి తీసిన ఫొటోను షేర్‌ చేసింది. దీన్ని ఇంత చేరువ నుంచి చూసి చాలా కాలమవుతోంది అని చెప్పుకొచ్చింది.

కాగా ఆమె నటించిన "మాస్టర్‌" సినిమా రిలీజై ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు క్సేవియర్‌ బ్రిట్టో నిర్మించాడు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు.

చదవండి: యంగ్‌ హీరోతో రొమాన్స్‌ చేయనున్న అనుష్క!

మాస్టర్‌ మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement