యంగ్‌ హీరోతో రొమాన్స్‌ చేయనున్న అనుష్క!

Anushka Shetty Will Romance With Young Hero - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో అనుష్క శెట్టి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు టాలీవుడ్‌ అగ్ర హీరోలందరితోనూ నటించిన ఈ భామకు ప్రస్తుతం సినిమాలు కరువయ్యాయి. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన అనుష్క.. ఇప్పుడు మాత్రం అవకాశాల కోసం ఎదురు చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన నిశ్శబ్దం కూడా అట్టర్‌ ప్లాప్‌ను ముటగట్టుకుంది. ఇప్పటి వరకూ మన స్వీటి చేతిలో ఒక్క సినిమా లేదు. అయితే ఈ కన్నడ బ్యూటీకి చెందిన ఓ విషయం తాజాగా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

‘రారా.. కృష్ణయ్య’ సినిమా దర్శకుడు మహేష్‌ పీ డైరెక్షన్‌లో అనుష్క ఓ సినిమాను ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోంది. ఆ ప్రొడక్షన్‌లో అనుష్క బాగమతితో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చేయబోయే సినిమాలో అనుష్క యువ హీరో నవీన్పొలిశెట్టితో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఎక్కవ వయసున్న అమ్మాయి(40), తక్కువ వయసున్న అబ్బాయి(25) మధ్య నడిచే లవ్‌ స్టోరిగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇప్పుడు వరస సినిమాలతో నవీన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ హీరో అయితే కథకు బాగుంటాడని యువీ క్రియేషన్స్ భావించడంతో ఈయన్నే తీసుకున్నట్లు టాక్‌. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మరోవైపు ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న నవీన్‌ పొలిశెట్టి ప్రస్తుతం  జాతి రత్నాలు అనే మూవీ చేస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది.  కామెడీ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది.

చదవండి: 

ట్రోలింగ్‌: నీకు 60 ఏళ్లా? వ్యాక్సిన్‌ తీసుకున్నావ్‌..

పోలీసులను ఆశ్రయించిన టాలీవుడ్‌ దర్శకుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top