Mahhi Vij Gets Rape Threat From Abusive Man, Share Video of Car Number Plate in Twitter - Sakshi
Sakshi News home page

Mahhi Vij: నా కూతురితో కారులో ఉన్నాను.. అతడు నోటికొచ్చినట్లు మాట్లాడాడు..: నటి

May 8 2022 3:58 PM | Updated on May 8 2022 4:32 PM

Mahhi Vij Gets Rape Threat From Abusive Man, Share Video of Car Number Plate in Twitter - Sakshi

'ఓ వ్యక్తి నా కారును ఢీ కొట్టడమే కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి భార్య పోనీలే, వదిలెయ్‌ అంటూ అతడిని తీసుకెళ్లింది. నన్ను

ప్రముఖ నటి, యాంకర్‌ మహి విజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన కూతురితో కలిసి బయటకు వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి తన కారును ఢీకొట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ మేరకు ట్విటర్‌లో తనకు ఎదురైన చేదు సంఘటనను వివరిస్తూ పోలీసుల సహాయం కోరింది. 'ఓ వ్యక్తి నా కారును ఢీ కొట్టడమే కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి భార్య పోనీలే, వదిలెయ్‌ అంటూ అతడిని తీసుకెళ్లింది. నన్ను భయభ్రాంతులకు గురి చేసిన సదరు వ్యక్తిని పట్టుకుని శిక్షిస్తారని కోరుకుంటున్నాను' అంటూ ముంబై పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది.

దీనిపై ముంబై పోలీసులు స్పందిస్తూ దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వమని సూచించారు. అయితే అప్పటికే తాను వర్లి స్టేషన్‌కు వెళ్లానని తెలిపింది. కారులో తన కూతురు తారా ఉందని, అతడలా బెదిరించడంతో తారా గురించి చాలా భయమేసిందని చెప్పుకొచ్చింది. కాగా మహి బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో నందిని పాత్రతో పాపులర్‌ అయింది. మలయాళ, హిందీ భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అలాగే నాచ్‌ బలియే అనే రియాలిటీ షోలో తన భర్త జై భన్సాలీతో పాల్గొంటోంది. గతంలో వీళ్లిద్దరూ నాచ్‌ బలియే సీజన్‌ 5 విన్నర్స్‌గా నిలిచారు.

చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారంలో విడుదలైన చిత్రాలు..

ప్రాజెక్ట్‌ కెలో దీపికా పదుకోన్‌తో పాటు మరో హీరోయిన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement