SSMB28: మహేశ్‌ మూవీకి తప్పని లీకుల బెడద.. కన్ప్యూజన్‌లో ఫ్యాన్స్‌!

Mahesh Babu Look Leaked From SSMB28 - Sakshi

సెల్‌ఫోన్‌, సోషల్ మీడియా వచ్చిన తర్వాత షూటింగ్ లోకేషన్స్ నుంచి లీక్స్ కామన్ అయిపోయాయి. చిన్న బడ్జెట్ సినిమాల సంగతి పక్కన పెడితే..భారీ బడ్జెట్ సినిమాలు ఈ లీకుల బెడద  నుంచి తప్పించుకోవటానికి ఎంత ప్రయత్నించినా...అవి ఆపటం ఎవరి వల్ల కావటం లేదు. పుష్ప2, సలార్ సినిమా షూటింగ్ లోకేషన్స్ నుంచి పోటోలు , వీడియో క్లిప్స్ లీక్స్ అయ్యాయి. ఇప్పుడు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న  #ssmb 28 మూవీ నుంచి మహేష్‌ బాబు ఫస్ట్ లుక్ లీక్ అయింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో మహేష్ బాబు  #ssmb 28 ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. 

పుష్ప 2, సలార్ మూవీ షూటింగ్ లోకేషన్స్ నుంచి ఆ క్లిప్స్ ఎవరు లీక్ చేశారో తెలియదు. కానీ  #ssmb 28 మూవీలోని మహేష్‌ బాబు లుక్ ఎవరు లీక్ చేశారో తెలిసిపోయింది. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో  నటించనున్నాడు. గతంలో జయరామ్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురంలో కూడా నటించాడు.ఇప్పుడు  #ssmb 28 లో మహేష్ తో కలిసి నటించనున్నాడు. 

యాక్టర్ జయరామ్, మహేష్ బాబు తో కలిసి నటించటం ఇదే మొదటిసారి. ఇక తను  #ssmb 28లో నటిస్తున్నట్లుగా జయరామ్ కన్ఫర్మ్ చేశాడు. అంతేకాదు త్రివిక్రమ్, మహేష్ బాబుతో కలిసి దిగిన పోటో తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. అలాగే ధియేటర్స్ లో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను...ఇప్పుడు ఆయన కొడుకు మహేష్‌తో కలిసి నటించటం సంతోషంగా వుందంటూ రాసుకొచ్చాడు. 

జయరామ్ తను మహేశ్‌ తో నటిస్తున్న సంగతి చెప్పడం ఏమో గానీ....నెటిజన్స్ అయితే  #ssmb 28లో మహేశ్‌ బాబు ఫస్ట్ లుక్ లీక్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించినప్పుడు మహేశ్‌ కు కొంచెం హెయిర్ ఎక్కువగానే ఉంటుంది.  ఆ లుక్ త్రివిక్రమ్‌ మూవీ కోసమే అని అందరికీ అర్ధమైంది. ఇప్పుడు జయరామ్ సెట్స్ నుంచి మహేష్‌ తో దిగిన పోటో షేర్ చేయటంతో...లుక్ పై మహేష్‌ ప్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. 

దసరా సీజన్ లో రిలీజ్ చేయాలను కుంటున్న ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ ఎండింగ్ కల్లా పాటలు, ఒక ఫైట్‌ మినహా మిగిలిన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమా టైటిల్ పై  సోషల్ మీడియా తెగ డిస్కషన్ నడుస్తోంది. అయోధ్యలో అర్జునుడు, ఆరంభం, అతడే తన సైన్యం వంటి టైటిల్స్ పరిశీలన ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

 అయితే ఈ మూడు టైటిల్స్ కాకుండా కొత్త టైటిల్ ను ఉగాది రోజు అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.మహేశ్‌బాబు కూడా ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు.ఈ సినిమా తర్వాత మహేశ్‌.. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తాడు.  పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించబోయే ఈ సినిమా ఓపెనింగ్ ఆగస్ట్ లో జరుగుతుందనే మాట టి.టౌన్ లో వినబడుతోంది.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top