దుబాయ్‌లో దీపావ‌ళి జ‌రుపుకున్న మ‌హేశ్ ఫ్యామిలీ

Mahesh Babu Celebrates Diwali With Family In Dubai - Sakshi

వారం రోజుల క్రితం ఫ్యామిలీతో క‌లిసి హీరో మ‌హేశ్‌ బాబు ఫ్లైటెక్కిన విష‌యం తెలిసిందే క‌దా! మ‌హేశ్ హాలీడే ట్రిప్ ప్లాన్ చేసింది మ‌రెక్క‌డికో కాదు.. దుబాయ్‌లో ఉంటున్న ఆయ‌న వ‌దిన‌మ్మ‌ ఇంటికే. అవును, న‌మ‌త్ర అక్క‌ శిల్పా శిరోద్క‌ర్‌ ఇంటికి కుటుంబంతో స‌హా వెళ్లిన మ‌హేశ్ అక్క‌డే దీపావ‌ళిని సెల‌బ్రేట్ చేసుకున్నారు. ప‌నిలో ప‌నిగా అక్క‌డి అంద‌మైన ప్ర‌దేశాల‌ను చుట్టొస్తూ ప్ర‌తిక్ష‌ణాన్ని పిల్ల‌ల‌తో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా ఫొటోను నమ్ర‌త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో సూప‌ర్ స్టార్ కుటుంబంతో పాటు శిల్ప, ఆమె భ‌ర్త‌, కూతురు ఉన్నారు. (చ‌ద‌వండి: విశ్వనాథ్‌గారిని కలవాలనిపించింది: చిరంజీవి)

"ఇల్లు కాని ఇంట్లో సేద తీరుతున్నాం. గ‌త రాత్రి మ‌ర్చిపోలేనిది.. అస‌లు ముఖానికి మాస్కులే లేవు(ఫొటో వ‌ర‌కు మాత్ర‌మే) దీపావ‌ళి పండ‌గ రోజు అంతా క‌లిసి బ‌య‌ట భోజ‌నం చేశాం. అయినా పండ‌గను ఫ్యామిలీతో జరుపుకోడానికి మించిన‌దేం ఉంటుంది. ఇలాంటి క్ష‌ణాలు అమూల్య‌మైన‌వి" అని న‌మ్ర‌త‌ రాసుకొచ్చారు. కొడుకు, కూతురుతో రెస్టారెంటులో భోజ‌నం చేస్తున్న ఫొటోను సైతం ఆమె‌ అభిమానుల‌తో ఇదివ‌ర‌కే పంచుకున్నారు. కాగా 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రంతో స‌క్సెస్ అందుకున్న మ‌హేశ్ 'స‌ర్కారు వారి పాట'తో మ‌రో హిట్టు త‌న ఖాతాలో వేసుకునే ప‌నిలో ప‌డ్డారు. స‌మాజానికి స్ట్రాంగ్ మెస్సేజ్ ఇవ్వ‌నున్న ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎమ్‌బి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది మ‌హేశ్‌కు 27వ సినిమా. (చ‌ద‌వండి: మ‌రో ఇద్ద‌రికి ప్రాణదానం చేసిన మ‌హేశ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top