మ‌రో ఇద్ద‌రికి ప్రాణదానం చేసిన మ‌హేశ్‌

Mahesh Babu Helps Two Kids Heart Surgery - Sakshi

పిల్ల‌ల‌ను ప్రేమించేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ వారికి ఆప‌ద వాటిల్లితే ముందుకొచ్చి సాయం చేసే వాళ్లు అతి కొద్దిమందే ఉంటారు. ఆ లిస్టులో సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు మొట్ట‌మొద‌టి స్థానంలో ఉంటారు. ఆయ‌న తాజాగా మ‌రో ఇద్ద‌రు చిన్నారులకు ప్రాణదానం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ఈ విష‌యాన్ని మ‌హేశ్ స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియ‌జేశారు. "మ‌రో రెండు గుండెలు మాతో క‌లిశాయి. ఇటీవ‌లే గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ఇద్ద‌రు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అందుకు సంతోషంగా ఉంది. ఇందుకు స‌హ‌కారం అందించిన ఆంధ్రా హాస్పిట‌ల్స్‌కు ధ‌న్య‌వాదాలు" అని రాసుకొచ్చారు. దీనిపై మ‌హేశ్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తూ.. "దేవుడు మా మ‌హేశ్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చ‌ద‌వండి: దీపికా పదుకొణె ఒక వలస కూలీ!)

కాగా మ‌హేశ్‌బాబు ఇలా సాయం చేసింది.. ఒక్క‌రికో, ఇద్ద‌రికో కాదు, గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వెయ్యి మందికి పైగా చిన్నారుల‌కు హార్ట్ స‌ర్జ‌రీలు చేయించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. భ‌విష్య‌త్తుపై ఆశ‌ను వ‌దిలేసుకున్న చిన్నారుల‌ను కాపాడి ఆ పేద కుటుంబాల్లో ఆశాజ్యోతిని వెలిగిస్తున్నారు. ఈ మంచి ప‌ని కోసం మ‌హేశ్‌ కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. సోష‌ల్ మీడియా విన్న‌పాల‌తో పాటు, వివిధ గ్రామాల్లో క్యాంపులు నిర్వ‌హించి అవ‌స‌రం ఉన్న‌వాళ్ల‌ను గుర్తించి వైద్య స‌హాయం అందిస్తున్నారు. (చ‌ద‌వండి: ప్రియ బర్త్‌డే: మహేశ్‌ ఫ్యామిలీ సందడి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top