ఫస్ట్‌ మహేశ్‌తోనే, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో!

Mahesh Babu And Trivikram Srinivas Soon Team Up For SSMB 28 Movie - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ సిద్దమవుతోంది. త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేయనున్నట్లు మహేశ్‌ ఇప్పటికే పలు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ‘మహేశ్‌ సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో డైరెక్షన్‌లో ఓ మూవీ రూపొందాల్సి ఉంది. తాజా బజ్‌ ప్రకారం మహేశ్‌ రాజమౌళితో కంటే ముందే మాటల మాంత్రికుడితో జతకడుతున్నట్లు తెలుస్తోంది. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో దర్శకుడు ఈ మూవీ రూపొందించేందుకు రేడి అయ్యాడట. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

అంతేగాక నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందులో మహశ్‌కు జోడీగా మరోసారి బుట్టబోమ్మ జతకడుతోంది. ఇప్పటికే ‘మహర్షి’ మూవీలో పూజా హెగ్డె, మహేశ్‌లు జంటగా ప్రేక్షకులను అలరించారు. ఈ సారి త్రివిక్రమ్‌తో కలిసి ఈ జంట వెండితెరపై సందడి చేయనుంది. జీఎమ్‌ బెంటస్‌, హారిక హాసిన్‌ క్రియేషన్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్‌ జూనీయర్‌ ఎన్టీఆర్‌తో కూడా ఓ చిత్రం చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ వాయిదా పడినట్లు వార్తలు గుప్పుమనగా నిర్మాత నాగవంశీ ఈ వార్తల్లో నిజం లేదంటూ ట్వీట్‌ చేశాడు. కాగా త్రివిక్రమ్ మాత్రం ‌ ‘ఎన్టీఆర్‌30’ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో ఉంచి ముందుగా మహేశ్‌ ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ మూవీని పట్టాలేక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌.  

చదవండి: 
చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్‌!‌‌ 
మరో సారి మహేశ్‌తో జతకట్టనున్న పూజా?
ఆ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తి.. త్రివిక్రమ్‌ మూవీకి బ్రేక్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top