Puri Jagannadh : ఛార్మితో అఫైర్‌ నిజమేనా? పూరి జగన్నాథ్‌ ఏమన్నారంటే..

Liger Director Puri Jagannadh Reveals Relationship With Charmme Kaur - Sakshi

పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్‌ తెలుగులో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్‌ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హీరోగా 'లైగర్‌' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వస్తున్నాయి.

చదవండి: చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశా : ఛార్మి

తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్‌ షిప్‌ను బయటపెట్టారు పూరి జగన్నాథ్‌. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తనకు  తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్‌ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్‌గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్‌ వస్తున్నాయి. అదే అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు.

చదవండి: రాజకీయాల్లోకి హీరోయిన్‌ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో..

కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్‌ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకేవళ అఫైర్‌ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌' అంటూ పుకార్లకు  పూరి ఫుల్ స్టాప్ పెట్టారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top