Charmy Kaur: భారీ ఆఫర్‌ను వదులుకున్నా.. ఎమోషనల్ అయిన ఛార్మి

ప్రస్తుతం ఎక్కడ చూసిన 'లైగర్' మూవీ జోరు కనిపిస్తోంది.రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్‌కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా విజయ్, పూరి జగన్నాథ్‌లను ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.
చదవండి: ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఛార్మి అడిగారు. ఇక లాక్‌డౌన్ టైంలో ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీగా ఆఫర్ వచ్చినా వదులుకున్నాననని, చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు చెబుతూ ఛార్మీ ఎమోషనల్ అయ్యింది.