LB Sriram Variety New Year Wishes Of 2023 - Sakshi
Sakshi News home page

LB Sriram: సినిమాల్లో ట్రై చేద్దామనుకుంటున్నానంటూ కమెడియన్‌ పోస్ట్‌

Jan 1 2023 3:57 PM | Updated on Jan 1 2023 5:16 PM

LB Sriram Variety New Year Wishes of 2023 - Sakshi

'హాయ్‌ ఫ్రెండ్స్‌.. కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం.. నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా!

'చాలా బాగుంది' సినిమాతో నటుడిగా బ్రేక్‌ అందుకున్నాడు ఎల్బీ శ్రీరామ్‌. కమెడియన్‌గా ఎన్నో సినిమాలు చేసిన ఆయన 'అమ్మో ఒకటో తారీఖు' చిత్రంతో సీరియస్‌ పాత్రలు కూడా చేయగలనని నిరూపించాడు. ముప్పై ఏళ్ల సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన షార్ట్‌ ఫిలింస్‌ కూడా చేశాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బును షార్ట్‌ ఫిలింస్‌కు ఖర్చు చేస్తూ సమాజానికి ఉపయోగపడే కథలను ప్రేక్షకులకు చేరవేస్తున్నాడు. తాజాగా ఆయన కొత్త సంవత్సరానికి వెరైటీగా వెల్‌కమ్‌ చెప్పాడు.

'హాయ్‌ ఫ్రెండ్స్‌.. కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం.. నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా! కొత్త కుర్రాణ్ణి కనక కుర్ర వేషాలేస్తున్నా' అంటూ పసుపు రంగు చొక్కాలో తెల్ల రంగు నిక్కర్‌లో స్టైల్‌గా నడుస్తున్న ఓ ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు శ్రీరామ్‌. ఇది చూసిన అభిమానులు 'రచయితలకి వయసేంటి మాస్టారు? మీరు నిత్య యవ్వనులు, రచనాప్రత్యుత్పత్తి నిరంతరాయప్రక్రియ', 'లవర్‌ బాయ్‌(ఎల్‌బీ)గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు', 'ముసలితనం మనిషికి కానీ మనస్సుకు కాదు సార్‌.. మీరు ఏం చెప్పినా అది నూతనమే, ఆధునాతనమే..' అంటూ న్యూఇయర్‌ విషెస్‌ చెప్తున్నారు.

చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లను షాపింగ్‌కు తీసుకెళ్తానన్న ప్రభాస్‌
ఆ విషయంలో నాకు, చరణ్‌కు పోలికే లేదు: చిరంజీవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement