నటన రంగంలోకి శ్రీదేవి మేనకోడలు, మ్యూజిక్‌ వీడియోతో కనువిందు | Sakshi
Sakshi News home page

Sridevi: నటన రంగంలోకి శ్రీదేవి మేనకోడలు, ఆకట్టుకుంటున్న వీడియో

Published Sat, Dec 11 2021 2:06 PM

Late Actress Sridevi Nephew Entry Into Entertaiment Field With A Music Video - Sakshi

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. అయితే ఆమె చిన్న కూతురు అనుకుంటే పొరపాటు పడ్డంటే. ఆమె శ్రీదేవి మేనకోడలు శిరీష. ఓ ప్రైవేటు మ్యూజిక్‌ వీడియో సాంగ్‌లో ఆమె కనువిందు చేస్తోంది. కేరళ నేపథ్యంలో అక్కడి సాంప్రదాయంలో ఓ లవ్‌ట్రాక్‌పై ఈ మ్యూజిక్‌ వీడియో సాగింది. ప్రస్తుతం ఈ మ్యూజిక్‌ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్‌.. సారా షాకింగ్‌ కామెంట్స్‌

మరో విశేషం ఎంటంటే ఇందులో మరో సీనియర్‌ నటుడు మనవడు కూడా నటించాడు. ‘నడిగర్ తిలకం’ శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శిరీషకు జోడిగా నటించాడు. కొన్ని జనరేషన్‌లుగా లవ్‌ చేసుకుంటున్న జంటల ప్రేమ ఇతివృతంలో ఈ పాట సాగింది. ఇందులో శిరీష, దర్శన్‌లు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఓ సెలబ్రిటీ ప్యాకేజి అనదగ్గ ఈ మ్యూజిక్ వీడియోను సీనియర్‌ నటి పద్మిని మనవరాలు లక్ష్మి దేవి రూపొందించింది.

చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్‌ ఫొటోలు

‘యదలో మౌనం’ అంటూ సాగే ఈ మ్యూజిక్‌ వీడియోకు అచ్చు రాజమణి, వరుణ్ మీనన్ సంగీతం సమకూర్చారు. టాలీవుడ్ యువ గీత రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించాడు. కాగా ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్‌ సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాన్వి.. బాలీవుడ్‌ లో వరస సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. ఇక రెండో కూమార్తె ఖుషి కపూర్‌ కూడా ఓ మంచి ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement