ఫోటోలకు ఫోజులు.. బ్యాలెన్స్‌ తప్పిన కృతి!

Kriti Sanon Almost Falls With High Heels Just Before Posing For Paparazzi - Sakshi

సెలబ్రిటీలు ఇల్లు విడిచి కాలు బయట పెడితే చాలు ఫోటోగ్రాఫర్లు వారిని చుట్టుమముడతారు. వీళ్లు ఎక్కడ కనపడినా, తిరిగినా తమ కెమెరాలలో బంధిస్తుంటారు. సీసీ కెమెరా కంటే ఎక్కువ ఫోకస్‌తో ఫాలో అవుతుంటారు. వీరి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక్క చోట కచ్చితంగా దొరికిపోతుంటారు. ఇటీవల బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ ముంబై నగర వీధుల్లో కంటపడింది. ఓ సెలూన్‌ సందర్శన కోసం వచ్చిన ఈ బ్యూటీ ఫోటోగ్రాఫర్ల కంటికి చిక్కింది. బ్లాక్‌ హైహీల్స్‌తో క్యాజువల్‌ వేర్‌లో ఉన్న కృతి తన లగ్జరీ కారు నుంచి బయటకు దిగుతుండగా బ్యాలెన్స్‌ తప్పి పడబోయింది.

పూర్తిగా కింద పడిపోతుండగా వెంటనే అప్రమత్తమైన ఈ భామ చివరి క్షణంలో తిరిగి సరిగా నిలబడింది. తరువాత ఫోటోలకు కూడా ఫోజులిచ్చింది. అయితే కృతి పడిపోతుండగా వీడియో తీశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. తమ కామెంట్లతో కృతిని ట్రోల్‌ చేస్తున్నారు. అందుకే ఎక్కువ ఎత్తు ఉన్న పాదరక్షలు వాడకూడదని ఫ్లాట్‌ చెప్పులు వాడలని సలహా ఇస్తున్నారు. మరికొంత మంది కృతికి అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్‌  తప్పడం సాధరణమని, అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని మద్దతుగా కామెంట్‌ చేస్తున్నారు.

చదవండి: 

సోషల్‌ హల్‌చల్‌: కళ్లతో కైపెక్కిస్తోన్న భామలు

హ్యాట్‌, బ్యాట్‌తో మంచు లక్ష్మి సందడి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top