డేంజర్‌ జోన్‌లోకి కృతీశెట్టి.. ఐరన్‌ లెగ్‌ ఇమేజ్‌కి అడుగు దూరంలో..! | Krithi Shetty Phased Back To Back Flaps, Her Career Fell Into Danger Zone | Sakshi
Sakshi News home page

Krithi Shetty: డేంజర్‌ జోన్‌లోకి కృతీశెట్టి.. ఐరన్‌ లెగ్‌ ఇమేజ్‌కి అడుగు దూరంలో..!

Sep 21 2022 1:09 PM | Updated on Sep 21 2022 2:48 PM

Krithi Shetty Phased Back To Back Flaps, Her Career Fell Into Danger Zone - Sakshi

టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు..పోతుంటారు. అందులో కొంతమంది మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంటారు. అలా చడీచప్పుడు లేకుండా వచ్చి యువత గుండెల్లో అలజడులు రేపింది కన్నడ బ్యూటీ కృతీశెట్టి. టాలీవుడ్‌లోకి ‘ఉప్పెన’దూసుకొచ్చిన ఈ బేబమ్మ... వరుసగా హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకొని స్టార్‌ హీరోయిన్‌గా మారింది. గతేడాది విడుదలైన ఉప్పెన సంచలన విజయం సాధించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌లో  కృతీశెట్టికే మేజర్ షేర్ ఇవ్వాలి.  ‘బేబమ్మ’చూడడానికి సినీ ప్రియులు మళ్లీ మళ్లీ థియేటర్స్‌కి వెళ్లారు. ఈ సినిమా విడుదలకు ముందే కృతీశెట్టికి వరుస అవకాశాలు లభించాయి. రెండో చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’కూడా కృతీశెట్టికి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘బంగార్రాజు’ కూడా మంచి విజయం సాధించింది.

దీంతో కెరీర్ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్ హిట్స్ దక్కించుకున్న అరుదైన హీరోయిన్ల లిస్ట్‌లో కృతీశెట్టి చేరింది. అంతేకాదు లక్కీ స్టార్‌ అనే ఇమేజ్‌ని సొంతం చేసుకోవడంతో పాటు రెమ్యునరేషన్‌ కూడా పెంచేసింది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు ఈ ‘బేబమ్మ’ ఐరెన్‌ లెగ్‌ ఈమెజ్‌కి అడుగు దూరంలో ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం  చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి.  దీంతో ఆమెపై నెగెటివ్ రిమార్క్స్ పడ్డాయి.

ఇక కృతీశెట్టి నటించిన లెటెస్ట్‌ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. సుధీర్ బాబు హీరోగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ మూవీకి తొలిరోజే నెగెటివ్‌ టాక్‌ రావడంతో.. కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. దీంతో కృతీ ఖాతాలో మరో ఫ్లాప్‌ వచ్చిపడింది. మొత్తానికి కెరీర్‌ బిగినింగ్‌లో హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసిన కృతీశెట్టి.. ఆ తర్వాత హ్యాట్రిక్‌ ఫ్లాపులను పూర్తి చేసింది. వరుస ప్లాపులు..ఆమె కెరీర్‌ని ప్రమాదంలో పడేశాయి. ప్రస్తుతం కృతీ చేతిలో నాగచైతన్య, సూర్య చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల ఫలితంపైనే ‘బేబమ్మ’ కెరీర్‌ ఆధారపడింది. ఇవి విజయం సాధిస్తే..కృతీ కెరీర్‌కి ఢోకా లేదు.. కానీ ఫ్లాప్‌ అయితే మాత్రం అవకాశాలు తగ్గిపోవడం ఖాయం.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement