టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌తో జతకట్టనున్న కోలీవుడ్‌ హీరో..! | Sakshi
Sakshi News home page

Sandeep Reddy Vanga: యానిమల్‌ డైరెక్టర్‌తో జతకట్టనున్న మరో స్టార్ హీరో!

Published Mon, Apr 1 2024 4:14 PM

Kollywood Star Hero Karthi acts In Tolllywood Directoe Sandeep Reddy - Sakshi

కోలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గతేడాది కార్తీ నటించిన 25వ చిత్రం జపాన్‌ పూర్తిగా నిరాశపరచడంతో ఆయన ఇప్పుడు స్పీడ్‌ పెంచారు. చిత్రాల విషయంలో జెడ్‌ స్పీడ్‌లో పరుగెడుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో వా వాద్ధియారే, 96 చిత్రం ఫేమ్‌ ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఖైదీ 2, సర్ధార్‌ 2 చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. వీటిలో సర్ధార్‌ -2 చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కాగా ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

కాగా.. అర్జున్‌రెడ్డి, యానిమల్‌తో సంచలన హిట్స్‌ కొట్టిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో నటించనున్నారన్నదే లేటేస్ట్ టాక్. మరోవైపు ప్రభాస్‌ హీరోగా స్పిరిట్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సందీప్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ తరువాత నటుడు కార్తీ హీరోగా ఓ చిత్రం చేయనున్నట్లు ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వైరలవుతోంది. అయితే ఈ క్రేజీ కాంబోలో రూపొందే చిత్రానికి ఇంకా చాలా టైమ్‌ ఉంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement