టీజర్‌తోనే భయపెడుతోన్న స్టార్ హీరో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kollywood Star Hero Arya Entry To Ott Web Series With The Village Teaser Out - Sakshi

కోలీవుడ్ హీరో ఆర్య తెలుగువారికి కూడా సుపరిచితమే. తన సినిమాలతో  టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ రోజుల్లో సినీ తారలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆర్య తొలి వెబ్ సిరీస్‌ 'ది విలేజ్' లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు  మిలింద్ రాజు దర్శకత్వంలో.. బి.ఎస్‌. రాధాకృష్ణన్‌ నిర్మించారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

ది విలేజ్‌ అనే గ్రాఫిక్‌ నవల ఆధారంగా హారర్, క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. టీజర్‌ రిలీజ్ చేసిన టీమ్.. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ నెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన టీజర్‌ ఈ సిరీస్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్‌, జార్జ్‌ మయన్‌, పూజా రామచంద్రన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

 కాగా.. ఆర్య ప్రస్తుతం తెలుగులో సైంధవ్‌ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూువీ 2024 జనవరి 13న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top