ప్లాస్టిక్‌ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్‌ | Khushi Kapoor on About Getting Nose Job and Lip Fillers | Sakshi
Sakshi News home page

Khushi Kapoor: ప్లాస్టిక్‌ సర్జరీ.. అందులో తప్పేముంది? నేను లిప్‌ ఫిల్లర్స్‌తో పాటు..

Jan 28 2025 10:05 AM | Updated on Jan 28 2025 12:59 PM

Khushi Kapoor on About Getting Nose Job and Lip Fillers

హీరోయిన్‌ అన్నాక అందంగా కనిపించడమే కాదు, ఆ అందాన్ని కాపాడుకోవాలి కూడా! అదే సమయంలో అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు సర్జరీలను ఆశ్రయిస్తారు. లిప్‌ ఫిల్లర్స్‌, ప్లాస్టిక్‌ సర్జరీ.. ఇలా రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ఇది తప్పేం కాదంటోంది హీరోయిన్‌ ఖుషీ కపూర్‌ (Khushi Kapoor). 

కనుబొమ్మల మధ్య..
'నా కనుబొమ్మ వెంట్రుకలు ఒత్తుగా ఉంటాయి. కానీ వాటి మధ్య గ్యాప్‌ కనిపించింది. దాన్నలా వదిలేయలేకపోయాను. కనుబొమ్మలు సరిచేయించుకున్నాను. ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేయించుకున్నాను. అప్పుడు పది రోజులవరకు కళ్లపై నీళ్లు పడనివ్వొద్దన్నారు. స్నానం చేసేటప్పుడు ధరించమని ఓ షీల్డ్‌ ఇచ్చారు. అది నాకు సరదాగా అనిపించింది. వాటిని కళ్లపై పెట్టుకుని మా ఫ్రెండ్స్‌కు ఫోటో పంపించాను. ఎవరూ దాన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఇప్పుడిలాంటివన్నీ సర్వసాధారణం. 

అవమానంగా ఫీలవడానికి ఏముంది?
ఇలాంటి పద్ధతులను అనుసరించడం నేరమేమీ కాదు. ప్లాస్టిక్‌.. అనగానే అదేదో అవమానంగా ఫీలవుతారు. దాని గురించి బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. కారణం జనాలు ఎక్కడ ద్వేషిస్తారోనని! నేనేమంటానంటే ద్వేషించాలనుకునేవారు ఏ సాకుతోనైనా అదే పని చేస్తారు. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు జనాలు కూడా నాగురించి ఏవేవో ఊహించుకున్నారు. నేనెలా ఉంటాను? ఏంటి? అంటూ ఎక్కువగా నెగెటివ్‌గానే చర్చించారు' అని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది ఖుషి కపూర్‌.. తాను లిప్‌ ఫిల్లర్స్‌ వేయించుకున్న విషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే.

ఆర్చీస్‌తో తెరంగేట్రం
ఇకపోతే దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి.. ద ఆర్చీస్‌ (2023) సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ మూవీలో బెట్టీ కూపర్‌గా నటించింది. ప్రస్తుతం లవ్‌యాపా మూవీ చేస్తోంది. ఇది తమిళ లవ్‌టుడే సినిమాకు రీమేక్‌ అని తెలుస్తోంది.

చదవండి: గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement