ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethireddy Jagadishwar Reddy) కొత్త సినిమాను ప్రకటించాడు. నిజ సంఘటనల ఆధారంగా ‘కాళీమాతా’(Kalimatha)ని తెరకెక్కించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రానికి ఆయన కథను అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘కాళీమాతా కేవలం సినిమా కాదు — ఇది ఒక ఉద్యమం.నిజ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం మతం, జాతి, భాష, ప్రాంతం అనే సరిహద్దులను దాటి — “సత్యానికి పాస్‌పోర్ట్ ఉండదు” అనే విశ్వసత్యాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. ఇది న్యాయం కోసం, సత్యం కోసం మానవత్వం చేసే ఆత్మపోరాటాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్స్ నటించబోతున్నారు. అలాగే ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియాతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేస్తాం. కాస్టింగ్‌తో పాటు పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు.



