Kerintha Fame Parvateesam New Film Started, Details Inside - Sakshi
Sakshi News home page

Actor Parvateesam: ‘కేరింత’ఫేమ్‌ పార్వతీశం హీరోగా కొత్త చిత్రం

May 13 2022 4:25 PM | Updated on May 13 2022 5:18 PM

Kerintha Fame Parvateesam New Film Started - Sakshi

వెంకటరమణ ఎస్, పార్వతీశం, ఐశ్వర్య, సిద్ధార్థ హరియాల

కేరింత ఫేమ్‌  పార్వతీశం, ఐశ్యర్య హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటరమణ  ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ హరియాల, శ్రీమతి తాలబత్తుల మాధవి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ నెల 25 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకటరమణ ఎస్. మాట్లాడుతూ...ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి, ఆర్టికల్ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. మంచి సామాజిక సందేశంతో పాటు ఓ విభిన్నమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపిస్తున్నాం. అన్నారు.

‘సమాజాన్ని, సమాజాన్ని పాలించే ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే చిత్రమిది. సామాజిక సందేశాన్ని ప్రేమకథతో మిళితం చేసి ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది’అని నిర్మాత సిద్దార్థ హరియాల అన్నారు. రామరాజు, చక్రపాణి, రంగస్థలం లక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement