కీర్తి సురేశ్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ | Keerthy Suresh Uppu Kappurambu Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి కీర్తి సురేశ్‌- సుహాస్‌ మూవీ.. ఎక్కడంటే?

Jun 16 2025 11:46 AM | Updated on Jun 16 2025 12:58 PM

Keerthy Suresh Uppu Kappurambu Movie OTT Release Date Out

తెలుగులో ఫేమస్‌ పద్యాల్లో 'ఉప్పు కప్పురంబు.. నొక్క పోలికనుండు' ఒకటి. ఈ పద్యాన్నే టైటిల్‌గా పెట్టుకుని ఓ సినిమా వచ్చేస్తోంది. హీరోయిన్‌ కీర్తి సురేశ్‌- హీరో సుహాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ఉప్పు కప్పురంబు. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కోసం రూపొందించిన ఒరిజినల్‌ మూవీ ఇది.

ఓటీటీలో..
ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్‌ వసంత్‌ కథ అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. జూలై 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. చిట్టి జయపురం గ్రామవాసులు అందించే వినోదాల విందుకు సిద్ధంగా ఉండమని ప్రైమ్‌ వీడియో ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement