
సిద్ధార్థ్ హీరోగా నటించిన '3BHK' సినిమా సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 7న విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్.. ఈ అంశం చుట్టూ 3BHK సినిమా ఉంటుంది. ఇందులో శరత్‌కుమార్, సిద్ధార్థ్ తండ్రికొడుకులుగా మెప్పించారు. దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం తెలుగులో కాస్త నిరాశ పరిచినప్పటికీ కోలీవుడ్లో మంచి టాక్ తెచ్చుకుంది.
'3BHK' సినిమా అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో నేడు (ఆగష్టు 1)న సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉండటంతో ఈ వీకెండ్ కుటుంబంతో పాటు అందరూ చూడతగిన చిత్రమని చెప్పవచ్చు. కథ కాస్త నెమ్మదిగా రన్ అవుతుందని విమర్శలు వచ్చినా.. ఫైనల్గా ఒక మంచి చిత్రాన్ని చూశామనే ఫీల్ కలుగుతుంది.
నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు.