Katrina Kaif And Vicky Kaushal Wedding: కత్రీనా పెళ్లి వేడుకలు.. ఎన్ని కిలోల మెహందీ వాడారంటే ?

To Katrina Kaif Wedding Nearly 20 Kg Of Organic Mehndi Powder Sent - Sakshi

To Katrina Kaif Wedding Nearly 20 Kg Of Organic Mehndi Powder Sent: బీటౌన్‌లో హాట్ టాపిక్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్‌ ప్రేమ వివాహం. 38 ఏళ్ల కత్రీనా కైఫ్, 33 సంవత్సరాల విక్కీ కౌశల్‌ ఒక ఏడాదికిపైగా డేటింగ్‌ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విక్ట్రీనా (విక్కీ కౌశల్‌-కత్రీనా కైఫ్‌లను అభిమానులు ప్రేమగా పిలుచుకునే పేరు) వివాహ వేడుకలు మంగళవారం (డిసెంబర్ 7) నుంచి  ప్రారంభమయ్యాయి. కత్రీనా కైఫ్, కౌశల్‌ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో సోమవారం సాయంత్రం ముంబై నుంచి జైపూర్‌కు వెళ్లారు. రెండు కుటుంబాలు 15 కంటే ఎక్కువ కార్లతో కూడిన కాన్వాయ్‌లో నేరుగా  జైపూర్‌ నుంచి సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బార్వారా హోటల్‌కు చేరుకున్నారు. సవాయ్‌ మాధోపూర్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ హోటల్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 

కత్రీనాకు సన్నిహితుడు చిత్ర దర్శకుడు కబీర్‌ ఖాన్, అతని భార్య మినీ మాథూర్‌, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార, నేహా ధూపియా-అంగద్‌ బేడీ దంపతులు, తదితరులు జైపూర్‌కు చేరుకున్నారని సమాచారం. మంగళవారం ఉదయం విక్కీ తమ్ముడు సన్నీ కౌశల్‌ స్నేహితుడు శర్వారీ వాఘ్‌, రాధిక మదన్‌ కూడా హాజరయ్యారు. జైపూర్‌కు నుంచి సుమారు 120 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ హోటల్‌కు ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌, ఎహసాన్‌ నూరానీ, పంజాబీ గాయకుడు గురుదాస్‌ మాన్‌ కూడా బుధవారం ఉదయం చేరుకున్నారని తెలుస్తోంది. 

ఈ పెళ్లి వేడుకల్లో భాగమైన మెహందీ ఫంక్షన్‌కు సుమారు 20 కిలోల ఆర్గానిక్‌ మెహందీ పౌడర్‌ సరఫరా చేశారట. ఈ మెహందీని రాజస్థాన్‌లోని పాలి జిల్లా సోజత్‌ పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప‍్పించినట్లు సమాచారం. అలాగే సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్ బార్వారాలో జరగనున్న విక్ట్రీనా పెళ్లికి మెహందీ పౌడర్‌తో పాటు 400 మెహందీ కోన్‌లు పంపించారట. అయితే ఈ సోజత్‌ పట్టణం మెహందీ సాగుకు ప్రసిద్ధి. ఈ వివాహ కార్యక్రమం కోసం ఈ ఆర్గానిక్‌ మెహందీ ప్రాసెస్ చేయడానికి సుమారు 20 రోజులు పట్టిందని సోజత్‌లో మెహందీ తయారీ కంపెనీ అయినా 'నెచురల్ హెర‍్బల్' యజమాని నితేష్‌ అగర్వాల్‌ తెలిపారు. 

ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్‌ కోసం రూ. 100 కోట్లు ఆఫర్‌.. ఎందుకో తెలుసా ?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top