సూర్య,జ్యోతిక వేరు కాపురం.. కన్నీళ్లు తెప్పిస్తున్న కార్తీ మాటలు

Karti Comments On Surya And Jyothika - Sakshi

కోలీవుడ్‌లో అందమైన కపుల్స్‌ అంటే వెంటనే చెప్పే పేరు సూర్య- జ్యోతికలదే... వారిద్దరినీ అభిమానులు కూడా అన్నావదిన అనే పిలుస్తూ ఉంటారు. కానీ కొద్దిరోజుల క్రితం సూర్య- జ్యోతికలు వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం జ్యోతిక పిల్లలతో ముంబైలో ఉంటుంది. సూర్య మాత్రం ముంబై టూ చెన్నై తిరుగుతున్నాడు. 2006లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పుడు జ్యోతిక కెరీర్ కూడా పీక్‌లో ఉంది. ఎన్నో ఎళ్లుగా కలిసి ఉ‍న్న కుటుంబంలో జ్యోతిక వల్లనే విబేధాలు వచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.

కానీ మరోక వర్గం మాత్రం  మొదటి నుంచి సూర్య, జ్యోతికను వివాహం చేసుకోవడం తండ్రి శివ కుమార్‌కు నచ్చలేదని, కొడుకు ఇష్టాన్ని కాదనలేక పెళ్లి చేశాడని అందుకే చాలా ఏ‍ళ్ల తర్వాత జ్యోతిక ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మరికొన్ని విషయాలను కూడా ఇలా చెప్పుకొచ్చారు. సూర్యతో పెళ్లికి ముందే జ్యోతికకు శివకుమార్ ఒక కండిషన్ పెట్టాడని.. పెళ్లి అయిన తర్వాత ఆమె సినిమాల్లో నటించకూడదని ఆయన చెప్పడంతో జ్యోతిక కొన్నేళ్లు సినిమాలకు దూరం అయ్యిందని రూమర్స్‌ వచ్చాయి.

ప్రస్థుతం  ఆమె మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టేసరికి మామగారు జీర్ణించుకోలేక పోవడంతో ఇంట్లో గొడవలు వచ్చాయని. కుటుంబంలో జరిగిన గొడవల్లో సూర్య కూడా జ్యోతికకే మద్ధతు ఇవ్వడం వల్ల అది తన తండ్రికి నచ్చలేదని కొందరు చెప్పుకొచ్చారు. దీంతో వారి కుటుంబంలో గొడవలు మరింత తారా స్థాయికి చేరాయని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కార్తీ కూడా తన అన్నకు సపోర్ట్‌ ఇవ్వలేదని కూడా పలువురు చెప్పుకొచ్చారు.

జ్యోతిక గురించి స్పందించిన కార్తీ
సూర్య కుటుంబం గురించి రకరకాలుగా కామెంట్లు వస్తున్నా ఇప్పటి వరకు వారి ఫ్యామిలీలో ఎవరూ స్పందించ లేదు. ఈ కుటుంబ విడిపోవడానికి ప్రధాన కారణం జ్యోతికనే అంటూ విపరీతంగా సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తుండటంతో అది నచ్చక కార్తీ ఇలా స్పందించాడు. ' నేను జ్యోతికను ఒక నటిగా ఎప్పుడూ చూడలేదు. నేను ఆమెను  ఆమ్మగానే చూశాను. తను కూడా మమ్మల్ని తన పిల్లలు మాదిరే చూసింది. అమ్మ ఇప్పుడు ముంబైలో ఉండటంతో ఇ‍ల్లు అంతా బోసిపోయి ఉంది. ఆమె లేని ఈ ఇంట్లో ఉండటం మా వల్ల కావడం లేదు. అమ్మతో (జ్యోతిక) కలిసి ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం.

ఇన్నేళ్లపాటు తామందరం కలిసి ఉంటున్నామంటే దానికి ప్రధాన కారణం జ్యోతికనే... కానీ అన్నయ్య పిల్లలు పెద్దలు అవుతున్నారు. వారి చదువుల కోసం మాత్రమే వారు ముంబై వెళ్లారు. వారి చదువులు పూర్తి అయిన తర్వాత తప్పకుండా తామందరం కలిసే ఉంటాం. ఈలోపు ప్రతి పండుగకు కలుస్తూనే ఉంటాం.' అని ఆయన చెప్పాడు. జ్యోతిక గురించి సూర్య సోదరుడు కార్తీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


కుటుంబం గురించి జ్యోతిక ఏం చెప్పింది
కార్తీ, సూర్యలకు బృందా అనే సోదరి కూడా ఉంది. తోబుట్టువుల మధ్య బంధం గురించి గతంలో  జ్యోతిక ఇలా చెప్పింది. బృందా, కార్తీల మధ్య ఎప్పుడూ టామ్‌ అండ్‌ జెర్రీ గొడవ ఉండనే ఉంటుంది. కానీ సూర్య అంటే బృందాకు  గౌరవం చూసి భయపడుతుంది కూడా. బృంద కోసం సూర్య ఏమైనా చేస్తాడు. చెల్లి అంటే ఆయనకు ఎనలేని ప్రాణం. కార్తీ అంటే నాకు కొడుకు,తమ్ముడు,స్నేహితుడు ఇలా ఎంతో అనుబంధం ఉంది. కార్తీ ఇంట్లో ఎప్పుడూ ఫన్నీగానే ఉంటాడు.' అని జ్యోతిక చెప్పింది. సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కంగువా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. మరోవైపు జపాన్‌ సినిమాతో కార్తీ దూసుకొస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top