డబ్బింగ్‌ షురూ | Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ షురూ

Published Fri, Sep 15 2023 5:19 AM

Karthi starrer Japan dubbing begins - Sakshi

కార్తీ హీరోగా నటించిన అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ మూవీ ‘జపాన్‌’. అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ మిల్టన్‌ కీలక పాత్రల్లో నటించారు. ‘జోకర్‌’ ఫేమ్‌ రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడిస్తూ, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్‌ షేర్‌ చేసింది. ‘‘కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా విడుదల చేసిన ‘జపాన్‌’ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో కార్తీ డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. కాగా ‘జపాన్‌’ చిత్రంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి పాత్రలో కార్తీ కనిపిస్తారని కోలీవుడ్‌ టాక్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement