పాపులర్‌ కమెడియన్‌పై బయోపిక్‌.. అతనెవరంటే ? | Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh | Sakshi
Sakshi News home page

Kapil Sharma: పాపులర్‌ కమెడియన్‌పై బయోపిక్‌.. అతనెవరంటే ?

Jan 14 2022 9:18 PM | Updated on Jan 14 2022 9:24 PM

Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh - Sakshi

Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh: సినీ చిత్రసీమలో అనేక మంది ప్రముఖులపై అనేక బయోపిక్‌లు వస్తున్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. స్టార్‌ హీరో హీరోయిన్లు, క్రికెట్‌ దిగ్గజాలు, మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్స్‌ వంటివారిపైనై ఈ బయోపిక్‌లు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఒక కమెడియన్‌పై ఎలాంటి బయోపిక్‌ తీయలేదు. దీన్ని బ్రేక్‌ చేస్తూ ప్రముఖ కమెడియన్‌పై తాజాగా బయోపిక్‌ చిత్రం రానుంది. అతనెవరంటే మోస్ట్‌ పాపులర్‌ హిందీ కామెడీ టాక్‌ షో  అయిన 'కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్ శర్మ' హోస్ట్‌ కపిల్ శర్మ. అవును కపిల్ శర్మపై బయోపిక్‌ త్వరలో  రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తన ట్విటర్‌ ద్వారా తెలిపాడు. 

కపిల్‌ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్‌ చిత్రానికి 'ఫంకార్‌' అని టైటిల్‌ పెట్టారు. దీనికి మహావీర్‌ జైన్‌ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్‌ సింగ్‌ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఈయన గతంలో ఫుక్రే సినిమాను డైరెక్ట్‌ చేశారు. అలాగే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పించనుంది. 'కపిల్‌ శర్మ కోట్లాది మంది ప్రజలకు ప్రతిరోజు నవ్వులను పంచుతాడు. అలాంటి కపిల్ శర్మ గురించి మీకు తెలియని జీవిత కథను వెండితెరపై చూపెట్టబోతున్నాం' అని మహావీర్‌ జైన్‌ తెలిపారు. 
 


ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్‌ ప్లే చేశారు.. చివరిగా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement