
ప్రముఖ సీరియల్ నటుడు శ్రీధర్(47) హఠాన్మరణం చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయనకు.. చాన్నాళ్లుగా చికిత్స అందిస్తున్నారు. కానీ అదేది కూడా ఈయనని మరణం నుంచి తప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో తోటి నటీనటులు, స్నేహితులు.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించా..: సీనియర్ హీరోయిన్ అర్చన)
పారు, వధు తదితర సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్.. 'మ్యాక్స్' అనే కన్నడ చిత్రంలోనూ నటించాడు. కేవలం నటుడిగానే కాకుండా మేకప్ ఆర్టిస్ట్, యాంకర్, వాయిస్ ట్రైనర్, థియేటర్ ఇన్‌స్ట్రక్టర్ తదితర విభాగాల్లోనూ తనదైన ప్రతిభతో రాణించాడు.
అయితే కొన్నాళ్ల క్రితం తీవ్ర అనారోగ్యం బారినపడ్డ శ్రీధర్ నాయక్.. కొన్నిరోజులకే గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కిపోయాడు. అప్పుడు తోటి నటీనటులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి మరీ విషమించడంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. దహన సంస్కారాలు కూడా మంగళవారం పూర్తయ్యాయి.
(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' కాజల్)