ఫ్యాన్స్‌కు సూర్య డబుల్‌ ధమాకా ఇస్తారా..? | Kanguva Movie Release Date Will Announce On July | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కు సూర్య డబుల్‌ ధమాకా ఇస్తారా..?

Published Thu, Jun 6 2024 9:26 AM | Last Updated on Thu, Jun 6 2024 9:32 AM

Kanguva Movie Release Date Will Announce On July?

కోలీవుడ్‌ అగ్ర నటుడు సూర్య హీరోగా, దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంగువా’. సూర్య కెరియర్‌లోనే అత్యంత  భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో తెరకెక్కించారు. ఈ క్రమంలో పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. పార్ట్‌ 1 ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం విజయం ఆధారంగా సీక్వెల్స్‌  తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, కంగువ విడుదల తేదీని ఇప్పటికి కూడా మేకర్స్‌ ప్రకటించలేదు. దీంతో సూర్య ఫ్యాన్స్‌ నుంచి ఆ చిత్ర నిర్మాణ సంస్థలు అయిన స్టూడియో గ్రీన్‌, యు.వి.క్రియేషన్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

గంగూవా చిత్రం సూర్య, డైరెక్టర్‌ శివకు ముఖ్యమైన చిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే శివ గత సినిమా రజనీకాంత్‌తో తీసిన అన్నాతై (తెలుగులో పెద్దన్న) భారీ ఫ్లాప్ అయ్యింది. కాబట్టి శివ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జ్ఞానవేల్ రాజా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది కావడం గమనార్హం. 

భారీ అంచనాలతో వస్తున్న కంగువ విడుదల తేదీని జులై 23న సూర్య పుట్టినరోజు కానుకగా అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. అదే రోజున సూర్య 44 అప్ డేట్స్ విడుదలయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య ఒక ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి సూర్య పుట్టినరోజున ఫ్యాన్స్‌ డబుల్ ట్రీట్‌ని ఆశించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement