జనవరికి డెడ్‌లైన్‌

Kamal Haasan wants Shankar to wrap up his portions in Indian-2 by January - Sakshi

కమల్‌హాసన్‌ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడతానని ఆ మధ్య ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’ చేస్తున్నారు కమల్‌హాసన్‌. కరోనా వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. అయితే సినిమాలో తన భాగాన్ని జనవరి నెలలోగా పూర్తి చేయాలని శంకర్‌ను కోరారట కమల్‌. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలు ఏప్రిల్‌ లేదా మేలో జరగనున్నాయి. అందుకు సిద్ధమవ్వడం కోసమే ఈ నిర్ణయం అని ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top