Kalinga : టీజర్‌ అదిరింది.. బిజినెస్‌ పెరిగింది | Kalinga Creates A Sensation Before Its Release | Sakshi
Sakshi News home page

Kalinga : టీజర్‌ అదిరింది.. బిజినెస్‌ పెరిగింది

Aug 20 2024 3:10 PM | Updated on Aug 20 2024 3:32 PM

Kalinga Creates A Sensation Before Its Release

కంటెంట్‌ కొత్తగా ఉంటే చాలు.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను హిట్‌ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలు వరుసగా వస్తున్నాయి. అలా డిఫరెంట్‌ కంటెంట్‌తో తెరకెక్కిన తాజా చిత్రమే ‘కళింగ’.  కిరోసిన్ హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు మరోసారి  విభిన్నమైన కథతో... వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. 

ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి అప్‌డేట్‌ మంచి అటెన్షన్‌ను డ్రా చేసింది. ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో ఈ సినిమా బిజినెస్‌ కూడా ఊపందుకుంది. 

ముఖ్యంగా ఈ చిత్రం ఓవర్‌సీస్‌ హక్కులను,  ఇప్పటి వరకు పలు బిగ్‌ ప్రాజెక్ట్‌ చిత్రాలను పంపిణీ చేసిన పీహెచ్‌ఎఫ్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా హిందీ రైట్స్‌ కోసం కూడా పలు సంస్థలు పోటీపడుతున్నాయి. 

నిర్మాత మాట్లాడుతూ 'నేటి ట్రెండ్‌కు తగ్గ కథాంశంతో..  ఫిక్షనల్ డ్రామా విత్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో  రూపొందుతున్న సినిమా ఇది. ముఖ్యంగా ఈ చిత్రానికి గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే అనేది బిగ్గెస్ట్‌ ప్లస్‌ అవుతుంది. ఆడియన్స్‌ ని ప్రతి సన్నివేశంలో థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. ముఖ్యంగా టీజర్‌లో ఉన్న సంభాషణలు, హీరో ధృవ వాయి నటన, స్క్రీన్ ప్రెజెన్స్.. విజువల్స్, ఆర్ఆర్ ఎంతో బజ్‌ను తీసుకొచ్చాయి. ఇది కేవలం టీజర్‌ మాత్రమే.. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆడియన్సకు గూజ్‌ బంప్స్‌ తీసుకొస్తాయి. చిత్ర ప్రమోషన్స్‌ను కూడా అగ్రెసివ్‌గా చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ రాబోతున్నాయి' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement