ఫ్యాన్సీ నంబర్‌ కోసం 17 లక్షలు ఖర్చు పెట్టిన యంగ్‌ టైగర్‌ | Junior NTR Buys Fancy Car Number 9999 for Rs. 17 Lakhs | Sakshi
Sakshi News home page

Jr NTR: రూ.17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ దక్కించున్న తారక్‌

Sep 22 2021 9:38 PM | Updated on Sep 23 2021 12:16 AM

Junior NTR Buys Fancy Car Number 9999 for Rs. 17 Lakhs - Sakshi

కారు కోసం కోట్లు పెట్టిన తారక్‌ ఫ్యాన్సీ నంబర్‌ కోసం లక్షలు గుమ్మరించాడు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారుల వేలం పాటలో..

Jr NTR: యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు కార్ల మీద మక్కువ ఎక్కువే. ఈ మధ్యే కోట్లు ఖర్చు పెట్టి లంబోర్ఘిని ఊరుస్‌ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నాడు. కారు కోసం కోట్లు పెట్టిన తారక్‌ ఫ్యాన్సీ నంబర్‌ కోసం లక్షలు గుమ్మరించాడు. తాజాగా ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేశారు. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.17 లక్షలు పెట్టి TS 09 FS 9999 నంబర్‌ దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన అన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్‌ బిడ్‌ అని అధికారులు చెప్తున్నారు.

గతంలోనూ తారక్‌ పది లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈసారి ఏకంగా రూ.17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ దక్కించుకుని తన రికార్డును తనే బద్ధలు చేసుకోవడం విశేషం. కాగా ఎన్టీఆర్‌ దగ్గరున్న కార్లకు అన్నింటికీ 9999 నంబర్‌ ఉంటుంది. కొత్తగా ఏ కారు తీసుకున్నా కూడా దానికి కూడా అదే నెంబర్‌ వచ్చేలా జాగ్రత్తపడతాడు. తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు, తండ్రి హరికృష్ణ 9999 కారు నంబర్‌గా వాడారని, అందుకే తనకు ఆ నెంబర్‌ ఇష్టమని, అలా దాన్ని కంటిన్యూ చేస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు తారక్‌. కార్లతో పాటు ఆయన ట్విటర్‌ ఖాతా కూడా @tarak9999 అనే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement