Back Door Movie In Pre Release Event poorna Jeevitha rajashekar- Sakshi
Sakshi News home page

‘బ్యాక్ డోర్’ కర్రి బాలాజీకి బోలెడు పేరు తేవాలి!

Dec 23 2021 2:57 PM | Updated on Dec 23 2021 3:44 PM

Jeevitha Rajasekhar Comments On  Back Door Movie In Pre Release Event - Sakshi

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు.  ఈ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం సాయంత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర బృందం.

కోలాహలంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, అడిషన్‌ ఎస్పీ కె.జి.వి. సరిత ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఈట్ సినిమా... డ్రింక్ సినిమా.. స్లీప్ సినిమాగా’అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి ‘బ్యాక్ డోర్’ బ్లాక్ బస్టర్ కావాలని అతిధులు ఆకాంక్షించారు. తనకు ‘బ్యాక్ డోర్’వంటి మంచి సినిమా ఇచ్చిన కర్రి బాలాజీకి హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ కెరీర్ లో ‘బ్యాక్ డోర్’ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పేర్కొన్న కర్రి బాలాజీ... ప్రి-రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘బ్యాక్ డోర్’ చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల చేస్తున్నాం’అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నటి కరాటే కల్యాణి, ప్రముఖ దర్శకులు వీరశంకర్, అజయ్ కుమార్, సంతోషం సురేష్, ప్రముఖ నటులు అశోక్ కుమార్, రామ్ రావిపల్లి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు నిరంజన్, మాధవ్, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement