స్టార్ హీరో యాక్షన్‌ థ్రిల్లర్‌.. టాలీవుడ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్! | Jayam Ravi and Keerthy Sutesh Starrer Siren Released in telugu | Sakshi
Sakshi News home page

Siren Movie: కీర్తి సురేశ్ పవర్‌ఫుల్‌ రోల్‌.. తెలుగులోను మోగనున్న సైరన్!

Feb 12 2024 8:45 PM | Updated on Feb 12 2024 8:56 PM

Jayam Ravi and Keerthy Sutesh Starrer Siren Released in telugu - Sakshi

'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ దక్కించుకున్న హీరో జయం రవి. ఆయన తాజాగా 'సైరన్' అనే మాస్ యాక్షన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో దసరా భామ కీర్తి సురేశ్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించారు. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. టాలీవుడ్‌లో ఈ సినిమా 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇ‍ప్పటికే తెలుగు టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. 

దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ.. " ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం. అదీ పెద్ద హీరోతో చేసినప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాలనుకుంటారు.  ఆ బాధ్యత జయం రవి తీసుకున్నారు. జీవీ గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని అన్నారు.

జయం రవి మాట్లాడుతూ.."ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జీవీ తన సంగీతంతో ప్రాణం పోశారు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీర్తి సురేశ్ మా నమ్మకాన్ని నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ లాంటి కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది హెచ్చరిస్తుంటారు. కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే విజయం కనిపిస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను.  మా సైరన్ తెలుగు ప్రేక్షకులని  ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, అజయ్, అలగం పెరుమాళ్, పాండ్యన్ కీలక పాత్రలు పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement