తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో స్టార్‌ హీరో కూతురి పెళ్లి.. | Sakshi
Sakshi News home page

తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో స్టార్‌ హీరో కూతురి పెళ్లి..

Published Tue, Jan 2 2024 1:27 PM

Ira Khan And Nupur Shikhare Get Ready Wedding - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌  కుమార్తె ఐరా ఖాన్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అమీర్‌  వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అయిన నుపుర్‌ను ఆమె ప్రేమించింది. వారిద్దరూ కూడా  ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం ఆపై పెద్దల అంగీకారంతో ఏడాది క్రితమే  నిశ్చితార్థం కూడా జరిగింది. జనవరి 3, 2024, అంటే రేపు ఐరా ఖాన్- నుపుర్ శిఖరే వైవాహిక జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ పెళ్లి వేడుకకు మరో రోజు మాత్రమే ఉండటంతో, వధూవరుల తల్లిదండ్రుల నివాసంలో వివాహ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అమీర్ ఇంటికి సంబంధించిన అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. 

అమీర్ ఖాన్ నివాసంలోని రెండు అంతస్తులు విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మరోవైపు అమీర్‌ మొదటి భార్య రీనా దత్తా ఇల్లు కూడా పూలతో కళకళలాడుతోంది. వివాహానికి సంబంధించి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. నవంబర్ 2022లో ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ఐరా ఖాన్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అనంతరం ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. బి-టౌన్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.  మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహానికి ముందు ఆచారాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కెల్వన్, ఉఖానా చేయడం ద్వారా వివాహానికి ముందు వేడుకలు ప్రారంభమవుతాయి.

బాంద్రాలోని రాయల్ తాజ్ ల్యాండ్స్ అండ్ హోటల్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జనవరి 6, 10 తేదీల మధ్య, 2 రిసెప్షన్ పార్టీలు నిర్వహించబడతాయని సమాచారం. ఢిల్లీ,  జైపూర్‌లలో రిసెప్షన్ వేడుక జరుగుతుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొననున్నారు. అమీర్ తన కుమార్తె పెళ్లి కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇప్పటికే తన బాలీవుడ్ స్నేహితులను వ్యక్తిగతంగా ఆహ్వానించాడు. 

మానసిక కుంగుబాటుకు గురైన 'ఐరా'
ఆమిర్‌ఖాన్‌ - ఆయన మొదటి భార్య రీనా దత్‌లకు ఐరా జన్మించారు. పరస్పర అంగీకారంతో తల్లీదండ్రులిద్దరూ విడిపోయిన తర్వాత ఐరా మానసిక కుంగుబాటుకు గురయ్యారు. కరోనా సమయంలో ఆమిర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో ఐరాకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది ప్రేమగా మారింది. ఇప్పుడు వారిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టడం విశేషం.

కూతురు పెళ్లిపై గతంలో అమీర్‌ ఎమోషనల్‌ కామెంట్‌
కూతరు పెళ్లి గురించి తన అభిమానులతో అమీర్‌ పంచుకున్నాడు.  జనవరి 3న ఐరా - నుపుర్‌ల పెళ్లి చేయాలని తాము  నిశ్చయించామని ఆయన గతంలోనే చెప్పాడు. నుపుర్‌ మంచి అబ్బాయని, ఐరా గతంలో మానసిక కుంగుబాటుతో పోరాడుతున్న సమయంలో తనకి అతడే అండగా నిలిచాడని ఆయన చెప్పాడు. పెళ్లి బంధంతో వాళ్లు సంతోషంగా ఉన్నందుకు తానెంతో ఆనందిస్తున్నానని ఆయన ప్రకటించారు. వారిద్దరిలో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. వాళ్ల మనసులు దగ్గరయ్యాయి. వాళ్ల పెళ్లి నాడు తానెంతో భావోద్వేగానికి గురవుతానని ముందే చెప్పాడు అమీర్‌.\

Advertisement
 

తప్పక చదవండి

Advertisement