హైదరాబాద్‌లో అత్యంత భారీ తెర.. వేచి ఉండక తప్పదు! | Imax Vice President Preetham Daniel Denies Partnering With Asian Cinema In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అత్యంత భారీ తెర.. వేచి ఉండక తప్పదు!

Jun 14 2025 5:25 PM | Updated on Jun 14 2025 5:31 PM

Imax Vice President Preetham Daniel Denies Partnering With Asian Cinema In Hyderabad

అత్యంత భారీ తెరపై సినీ అనుభవం కోసం.. హైదరాబాద్‌లోని సినీ ప్రియులు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. ఐ మ్యాక్స్‌ కార్పొరేషన్‌ ప్రకటనతో ఈ విషయం స్పష్టమైంది.  

పదేళ్ల క్రితం.. తెరమరుగై.. 
ఇటీవలే ఏషియన్‌ సినిమా గ్రూప్‌ అధిపతి సునీల్‌ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నగరంలోని హకీంపేట ప్రాంతానికి సమీపంలో తమ ఆధ్వర్యంలో ఐమాక్స్‌ స్క్రీన్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 70 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న స్క్రీన్‌ కోసం ప్రణాళికలను కూడా ఆయన వెల్లడించారు. ఇది ఐమాక్స్‌ అనుభవం కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. 2014లో ఐకానిక్‌ ప్రసాద్స్‌ ఐమాక్స్‌ తెర‘మరుగై’పోయిన దగ్గర నుంచి మళ్లీ ఐమాక్స్‌ తిరిగి రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారు ఐమాక్స్‌ మ్యాప్‌లో సిటీ తన స్థానాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని సంతోషించారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  

ఖండించిన ఐమ్యాక్స్‌.. 
అయితే ఐమ్యాక్స్‌ కార్పొరేషన్‌ అధికారికంగా ఏషియన్‌ సినిమాస్‌తో భాగస్వామ్యం వార్తల్ని ఖండించింది. ఈ మేరకు ఐమ్యాక్స్‌ కార్పొరేషన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రీతం డేనియల్, ఎక్స్‌లో పోస్ట్‌ చేసారు. దాంతో ఐమ్యాక్స్‌ నగరానికి ఇప్పట్లో రాదనే విషయం ఖరారైంది. దేశంలోనే తొలి ఐమ్యాక్స్‌ కలిగి ఉన్న నగరం అనే హోదాను పోగొట్టుకున్న సిటీ ఐమ్యాక్స్‌ తెరలు ఉన్న నగరాల జాబితాలో చేరడానికి కూడా మరింత కాలం వేచి ఉండక తప్పదు. 

Advertisement
 
Advertisement
Advertisement