
అలౌకిక, పద్మవ్యూహం, ఎండమావులు.. ఇలా ఎన్నో హిట్ సీరియల్స్‌లో నటించాడు ఇంద్రనాగ్ (Indra Nag). తర్వాతేమైందే ఏమో కానీ నెమ్మదిగా బుల్లితెరకు దూరమైపోయాడు. చాలాకాలం తర్వాత ఇంద్ర నాగ్ కెమెరా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ప్రభాకర్‌తో ఉన్న గొడవల గురించి, ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం గురించి మాట్లాడాడు.
రెమ్యునరేషన్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంద్రనాగ్ మాట్లాడుతూ.. నా అసలు పేరు నాగేంద్ర. మాది తూర్పు గోదావరి. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. కన్నడలో సినిమా ఆఫర్లు వస్తే భాష కష్టంగా ఉందని చేయనని చెప్పేశాను. 23 ఏళ్లకే పెళ్లి పీటలెక్కాను. చిన్నమామయ్య కూతురినే పెళ్లి చేసుకున్నా.. మాకు పాప పుట్టేనాటికి నా భార్య వయసు 16 ఏళ్లే! 24వ ఏట ఇండస్ట్రీలోకి వచ్చాను. కెరీర్ తొలినాళ్లలో నటుడిగా రోజుకు రూ.1500 పారితోషికం ఇచ్చేవారు. దర్శకత్వం చేసేటప్పుడు రోజుకు రూ.15 వేలు తీసుకున్నాను.
ప్రభాకర్‌తో గొడవ?
ప్రభాకర్ నాకంటే సీనియర్. తను మొదటినుంచీ నాతో ఎక్కువగా మాట్లాడడు. నేను మాత్రం ఆయన్ను గౌరవిస్తాను. మా మధ్య ప్రత్యేకంగా గొడవలేమీ లేవు. కానీ ఆయనకు నామీద కోపం ఉందని తన ఇంటర్వ్యూ చూశాక తెలిసింది. దానికి నేనేం చేయలేను. ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాను. కరోనా తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కొంత డిప్రెషన్‌గా అనిపిస్తోంది. ప్రతిదానికి లోతుగా ఆలోచిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇంద్రనాగ్.. తెలుగులో నాన్‌స్టాప్ మూవీలో హీరోగా నటించాడు. ప్రస్తుతం నిండు మనసులు సీరియల్ చేస్తున్నాడు.
చదవండి: మా జీవితంలోకి అమ్మవారు వచ్చిన రోజు.. ఘనంగా కూతురి ఫస్ట్ బర్త్‌డే