
హైదరాబాద్: మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సోమవారం జరిగిన హరిహరి వీరమల్లు ప్రీ లాంచ్ కార్యక్రమానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడమేగాక లాఠీచార్జ్ చేశారు. వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండగా దానిని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు వైఖరిపై రంగారెడ్డి జిల్లా ఎల్రక్టానిక్ మీడియా జాయింట్ సెక్రటరీ మహమ్మద్ షకిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.