Hombale Films: హోంబలే ఫిల్మ్స్ భారీ పెట్టుబడి.. అన్ని భాషల్లోనూ ఎంట్రీ..!

Hombale Films to invest Rs 3000 crore in Indian film industry  - Sakshi

కన్నడలో బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్'. కేజీఎఫ్, కాంతార లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ రాబోయే ఐదేళ్లలో భారతీయ వినోద పరిశ్రమలో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ వెల్లడించారు. అన్ని సౌత్ భాషల్లో సినిమాలను నిర్మించేందుకు తమ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విజయ్ కిరగందూర్ మామట్లాడుతూ.. 'భారత్ వినోద పరిశ్రమలో వచ్చే ఐదేళ్ల పాటు రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాం. దీనివల్ల ఇండియాలో వినోద పరిశ్ర మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ప్రతి ఏడాది ఒక ఈవెంట్ మూవీతో సహా ఐదారు సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం మేము అన్ని దక్షిణ భాషలలో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సాంస్కృతిక కథల ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ప్రయత్నిస్తున్నాం.' అని అన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top