India's Highest-Paid Singer Charges Rs 3 Crore Per Song, Check Here Name - Sakshi
Sakshi News home page

Singer Remuneration: ఈ సింగర్ చాలా కాస్ట్‌లీ గురూ.. మరీ అన్ని కోట్లా?

Published Tue, Jun 27 2023 3:23 PM

Highest Paid Singer In India - Sakshi

ఓ సినిమా హిట్ కావాలంటే ఏమేం ఉండాలి? అని అడగ‍్గానే.. హీరో, హీరోయిన్, మంచి కథ ఇలా చాలా చెబుతారు. వీటన్నింటితో పాటు మరో ముఖ్యమైనది ఒకటుంది. అదే సంగీతం. సినిమా ఎంత యావరేజ్ గా ఉన్నా ఓ హిట్ సాంగ్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ‍్యూజిక్ పడితే చాలు ఆ మూవీ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సింగర్స్ కి ఇచ్చే రెమ్యునరేషన్ మాత్రం తక్కువే. అయితే మన దేశంలోనే ఓ సింగర్, ఒక‍్కో పాట కోసం రూ.3 కోట‍్లు తీసుకుంటున్నాడని మీలో ఎంతమందికి తెలుసు!

దక్షిణాదిలో ఇచ్చేది తక్కువే!
ఏ సినిమా తీసుకున్నా సరే సినిమాలో పాటలు కీ రోల్ ప్లే చేస్తాయి. ఒకవేళ అవి లేకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ సింగర్ అయిన సిద్ శ్రీరామ్.. ఒక్కో పాట కోసం రూ.4 లక్షల వరకు తీసుకుంటాడట. మిగతా సింగర్స్ చాలావరకు రూ.లక్ష లోపే రెమ్యురనేషన్ తీసుకుంటుంటారు. సౌత్ లో ఏమో గానీ బాలీవుడ్ లో మాత్రం సింగర్స్ కి లక్షల్లో ఇస్తుంటారు. ఈ జాబితా కూడా చాలా పెద్దదే.

(ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!)

పాటకు రూ.3 కోట్లు!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సింగర్స్ లో ఏఆర్ రెహమాన్ కచ్చితంగా టాప్ లో ఉంటాడు. స్వతహాగా సంగీత దర‍్శకుడు అయినప్పటికీ.. అప్పుడప్పుడు సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాడు. అలా రెహమాన్ ఒక్కో పాట కోసం రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడట. కొన్నిసార్లు ఆ మొత్తం రూ.5 కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

ఈ సింగర్స్ కూడా కాస్ట్‌లీ!
ఏఆర్ రెహమాన్ తర్వాత చూసుకుంటే.. స్టార్ ఫిమేల్ సింగర్ శ్రేయా ఘోషల్ ఓ పాట కోసం రూ.25 లక్షల వరకు తీసుకుంటుందట. సునిధి చౌహాన్, అర్జిత్ సింగ్.. రూ.20-22 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. సోనూ నిగమ్, బాద్ షా అయితే రూ.18-20 లక్షల వరకు అందుకుంటారని టాక్. మిగతా వారిలో షాన్, నేహా కక్కర్, మికా సింగ్, హనీ సింగ్ తదితరులు రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: సినిమాల్లో స్టార్ కాంబోలు సరే.. మరి సక్సెస్ రేట్?)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement