పెళ్లి సందడి మళ్లీ మొదలు

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన వందకు పైగా చిత్రాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలున్నాయి. మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఆయన బెస్ట్ సినిమాల్లో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పెళ్లి సందడి’ ఒకటి. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు ఆయన. ‘మ్యూజికల్ సిట్టింగ్స్ ప్రారంభం అయ్యాయి, నటీనటుల వివరాలు త్వరలో చెబుతాం’ అని ఓ వీడియో ద్వారా ప్రకటించారు. మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి