Nithiin: న్యూ లుక్‌లో సర్‌ప్రైజ్ ఇచ్చిన నితిన్

స్టార్ హీరో నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచింది.
అయితే తాజాగా హీరో నితిన్ న్యూ లుక్‌లో దర్శనమిచ్చాడు. అంజనేయస్వామి స్వామి దీక్ష ధరించి కనిపించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీక్ష ధరించిన దుస్తుల్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
బాబాయ్ హోటల్ ప్రారంభించిన నితిన్
హైదరాబాద్‌లో బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను నితిన్ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు. డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైద్రాబాద్‌లోని మణికొండకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ పాల్గొన్నారు.
Sri Anjaneyam 🙏🙏
Sarvadha Jayam..!!
Enjoy ur Aadhivaaram 🤗🤗 pic.twitter.com/JUn0zNnsHi— nithiin (@actor_nithiin) January 22, 2023
మరిన్ని వార్తలు :