శివరాత్రికి ఓటీటీలో హనుమాన్‌?? | Sakshi
Sakshi News home page

Hanuman OTT: 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ అప్పుడేనా?

Published Fri, Mar 1 2024 12:56 PM

Hanuman Movie OTT Release Date And Streaming Details Latest - Sakshi

సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఏడాది పండక్కి థియేటర్లలో విడుదలైన వాటిలో ఈ చిత్రంపై పెద్దగా ఎవరికీ అంచనాల్లేవు. అయితేనేం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసిందీ చిత్రం. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమానే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. ఓ సాధారణ మనిషికి హనుమంతుడికి ఉండే సూపర్ పవర్స్ వస్తే.. వాటిని ఎలాంటి పనులకు ఉపయోగించాడు. చివరకు ఏమైంది? అనే సింపుల్ కాన్సెప్ట్‌తో సినిమా తీశారు. కానీ హనుమంతుడికి సంబంధించిన సీన్స్, పాటలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు భలే నచ్చేశాయి. ఈ క్రమంలోనే సూపర్ సక్సెస్ అందుకుంది.

ఇకపోతే 'హనుమాన్' డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. తొలుత ఈ సినిమా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది. కానీ థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూసి వాయిదా వేసుకున్నారు. మార్చి 2న ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ అది కూడా మారిపోయింది. శివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. సంక్రాంతికి థియేటర్లలో 'హనుమాన్' నామస్మరణతో ఊగిపోయాయి. ఇప్పుడు శివరాత్రికి మళ్లీ అదే సీన్ రిపీట్ కానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

Advertisement
 
Advertisement