పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంది: హన్సిక

Hansika Motwani Arrives In Chennai For First Time After Her Wedding - Sakshi

తమిళ సినిమా: సినిమా కెరీర్‌ను చక్కగా ప్లాన్‌ చేసుకున్న నటీమణుల్లో హన్సిక ఒకరని చెప్పవచ్చు. ఈ ముంబాయి భామ దక్షిణాదినే ఎక్కువగా చిత్రాలు చేసి పేరు తెచ్చుకుంది. గ్లామర్‌నే నమ్ముకున్న ఈ బ్యూటీ ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోలతో జతకట్టే అవకాశాలు దక్కించుకుంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటికీ 50 చిత్రాలకుపైగా నటించింది. కెరీర్‌ బిజీగా ఉండగానే పెళ్లి చేసుకుంది. సోహైల్‌ అనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో గత ఏడాది డిసెంబర్‌ 4వ తేదీ పెళ్లి జరిగింది. ఒకపక్క వివాహ జీవితాన్ని అనుభవిస్తూనే నటనకు సిద్ధమైంది.

సోమవారం సాయంత్రం ఈ అమ్మడు చెన్నైకి చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె అభిమానులు పూలమాలలతో స్వాగతం పలికారు. మీడియా హన్సికను చుట్టుముట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను చెన్నైలో అడుగుపెట్టగానే పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందని పేర్కొంది. 2022 సంవత్సరం తనకు చాలా లక్కీ అని.. ప్రస్తుతం తాను అంగీకరించిన 7 చిత్రాలు చేతిలో ఉన్నాయని చెప్పింది. పూర్తి చేయడానికి సిద్ధమైనట్లు పేర్కొంది. తన వివాహ జీవితం ఆనందంగా సాగుతోందని చెప్పింది. నెల రోజులపాటు చెన్నైలోనే ఉండి చిత్రాలను పూర్తి చేస్తానని వెల్లడించింది.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top